CM YS Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ప్రచారంలో ముందుకు వెళుతుంది. మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళుతుంది. ఇడుపుల పాయలో ప్రారంభమైన ఈ బస్సు యాత్ర శుక్రవారం గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. సత్తెనపల్లి నియోజకవర్గం, దూళిపాళ్ల నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. సత్తెనపల్లి , మేడికొండూరు, గుంటూరు మీదుగా యాత్ర సాగుతుంది. ఏటూకూరు బైపాస్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. సభ అనంతరం సీఎం జగన్ నంబూరులో రాత్రికి బస చేస్తారు. జగన్ బస్సు యాత్ర 13వ రోజు గుంటూరు జిల్లా ధూళిపాళ్ల నుంచి ప్రారంభవుతుంది. రంజాన్ సందర్భంగా నిన్న (గురువారం) ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చారు.
12వ రోజు పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం గంటావారిపాలెం నుంచి బయలుదేరి బస్సు యాత్ర పిడుగురాళ్ల వరకు అక్కడ నుంచి ధూళిపాళ్ల వరకు కొనసాగింది. అక్కడే జగన్ బస చేశారు. ధూళిపాళ్ల బస నుంచి సీఎం జగన్ బయలుదేరగా, సత్తెనపల్లి, కోర్రపాడు, మేడికొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు దగ్గరకు చేరుకొని అక్కడ భోజన విరామం తీసుకుంటారు. అనంతరం చుట్టుగుంట సర్కిల్, వీఐపీ రోడ్ మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఏటుకూరు బైపాస్ చేరుకుంటారు. అక్కడ జరిగే మేమంతా సిద్ధం బహిరంగ సభలో జగన్ పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో జగన్ అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరిస్తూ వారి సమస్యలని తెలుసుకుంటున్నారు.
ఇక జగన్ బస్సు యాత్రలో భాగంగా ఆయనని అభిమానించేవారు ఒక్కసారిగా ఆయన వద్దకు వచ్చారు. కొందరితో జగన్ సెల్ఫీలు దిగారు. కొందరిని ఆప్యాయంగా పలకరించారు. ఇంకొందరు జగన్‌ని డ్యాన్స్ చేయాలంటూ ఫోర్స్ చేశారు. ఈ క్రమంలో ఆయన కాలు కదిపినట్టు ఓ వీడియో అయితే నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఇటీవల జగన్‌ని కలిసేందుకు చెప్పులు లేకుండా కాన్వాయ్ వెంట పరుగులు తీసింది వెంకాయమ్మ అనే మహిళ. ఆమెను చూసి కాన్వాయ్ ఆపారు సీఎం. ఆమెను పిలిచి మాట్లాడారు. రామిరెడ్డిపాలేనికి చెందిన వెంకాయమ్మ.. ముఖ్యమంత్రిని కలిసేందుకు ఎండను కూడా లెక్కచేయకుండా కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది.