Undavalli Arun Kumar : మే 13న ఏపీలో అసెంబ్లీలో ఎన్నికలు ఉండగా, ఈ సారి ఎవరు అధికారంలోకి వస్తారా అని జోరుగా చర్చ నడుస్తుంది. ఎవరికి నచ్చినట్టు వారు జోస్యాలు చెబుతున్నారు. అలానే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్‌పై కూడా తమదైన కామెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని.. ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని అన్నారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని విమర్శించారు.
రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.. ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడో చూసుకుని వారికి ఓటేస్తున్నారు తప్ప.. నోటా జోలికి వెళ్లడంలేదని చెప్పుకొచ్చారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే దానిపై ఉండవల్లి స్పందిస్తూ తాను ఇప్పుడు మాట్లాడను. నేను ఇప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెబితే నా ఓటు గురించి లీక్ చేసినట్టే. నేను దాని గురించి ఇప్పుడు మాట్లాడను అని అరుణ్ కుమార్ అన్నారు. ఇక అమరావతి రాజధాని విషయంలో కూడా ఆయన నిరాశ వ్యక్తం చేసారు.
రాజాధాని ఎక్కడ ఉన్నా కూడా పరిపాలన బాగుండాలని ఆయన చెప్పారు. 175 స్థానాల్లో జగన్ తరపున కాదు.. జగనే పోటీ చేస్తున్నారని ఉండవల్లి సెటైర్ వేశారు. రాష్ట్రంలో అర్బన్ ఏరియాల్లో జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓట్లు కనపడుతున్నాయని ఉండవల్లి జోస్యం చెప్పారు. వైసీపీ కంటే ఎక్కువగా ఇస్తామంటూ టీడీపీ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారని, వీటన్నింటిని ప్రజలకు అందించడం ఎలా సాధ్యమనే విషయాలను ఒకసారి పరిశీలన చేసుకోవాలని ఉండవల్లి అన్నారు. చదువుకున్నవారు రోడ్లు బాలేదనో, ఇంకేదో లేదనో వైసిపికి వ్యతిరేకం అవ్వొచ్చు. రూరల్లో మాత్రం వైసిపి పాజిటివ్ గా ఉంది జగన్ 40%, చంద్రబాబుకు 40% ఓట్ పర్సంటేజ్ వస్తాయనుకుంటున్నానని చెప్పుకొచ్చారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…