Chandra Babu : ప్రస్తుతం ఏపీలో ఎన్నికల ప్రచారం చాలా వాడివేడిగా సాగుతుంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పరస్పర ఆరోపణలు చోటు చేసుకుంటోన్నాయి. విమర్శల దాడులు తీవ్రతరం అయ్యాయి. వ్యక్తగత విమర్శలూ యథేచ్ఛగా దొర్లుతున్నాయి. వైసిపి అరాచక పాలనతో ప్రజలు విసుగు చెందారని పేర్కొన్న చంద్రబాబు చీకటి పాలనను అంతం చేసేందుకు, ఓట్లు చీలకూడదు అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఎంతో విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వ సహాయం అవసరమని అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్ కళ్యాణ్ అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను ప్రశంసించారు. నాకు అనుభవం ఉందని పేర్కొన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పవర్ ఉందని వ్యాఖ్యలు చేశారు. అగ్నికి వాయువు తోడైనట్లు ప్రజా గళానికి వారాహి తోడైందని చంద్రబాబు అన్నారు. అది జగన్ అహంకారాన్ని బూడిద చేస్తుందన్నారు.ఇక చిరంజీవి, రాజమౌళి విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ జగన్‌పై నిప్పులు చెరిగారు చంద్రబాబు.2021లో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు ప్రతినిధులు ఏపీ సీఎంతో సమావేశమైన సందర్భంలో సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించమని అభ్యర్థించడానికి జరిగిన సంఘటనను ఆయన ప్రస్తావించారు. ఆ సమయంలో చిరు, ప్రభాస్‌తో పాటు మరికొందరు తమ కార్లను కొంత దూరంలో పార్క్ చేసి మీటర్ల దూరం నడిచేలా చేశారు.
చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చింది. రాజమౌళి పద్మభూషణ్ అందుకున్నారు. వారిని ఇంటికి పిలిచి అవమానిస్తారా. అసలు చిరంజీవితో జగన్ మోహన్ పోలిక ఉందా. మన ప్రభుత్వంలో ఏ నటుడిని అవమానించలేదు. జగన్ ఇంత మొండి వైఖరితో ప్రవర్తిస్తారా అంటూ పవన్ సమక్షంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…