Director Geetha Krishna : ఒకప్పుడు టాలీవుడ్ లో అదిరిపోయే సినిమాలు తీసి టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు గీతాకృష్ణ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే చాలా ఏళ్ల క్రితమే సినిమాలు తీయడం మానేసిన ఈయన ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. 1987లో సంకీర్తన అనే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన గీతా కృష్ణ తన మొదటి చిత్రంతోనే దర్శకుడి ఉత్తమ మొదటి చిత్రంగా నంది అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత కోకిల, కీచురాళ్లు, ప్రియతమా, సర్వర్ సుందరం గారి అబ్బాయి, కాఫీబార్ వంటి సూపర్ డూపర్ హిట్టు చిత్రాలను తెరకెక్కించాడు. కేవలం తెలుగులోనే కాకుండా.. తమిళంలో కూడా టైం, నిమిడంగల్ అనే సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక ఆ తర్వాత నుంచి ఆయన సినిమాలు చేయలేదు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దేవర, తండేల్ సినిమాలు ఒక సమయంలో విడుదల కానున్నాయి… పోటీ ఎలా ఉండబోతుందని అడిగారు. దీనికి డైరెక్టర్ గీతా కృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ గ్రేట్ యాక్టర్ అని ఆయన సినిమాకు నాగ చైతన్య సినిమాకు పోటీ ఏంటని అన్నారు. అలాగే నాగ చైతన్య అప్ కమింగ్ హీరో అని.. ఆయనకు సరిగ్గా నటించడం కూడా రాదంటూ చెప్పుకొచ్చారు.ఇక విజయ్ దేవరకొండ గురించి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన తన గురించి గొప్పలు చెప్పుకోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఆయన రెమ్యునరేషన్ ఆయన తీసుకుంటున్నారు. దర్శకుడికి నిర్మాతలకే నష్టం అని చెప్పుకొచ్చాడు గీతా కృష్ణ.
విజయ్ దేవరకొండ తన సినిమాలు వంద కోట్లు వసూళ్లు చేస్తుందని ఎందుకు గొప్పలు చెప్పుకోవడం, సినిమానే నిరూపిస్తుందిగా లేని పోని మాటలు చెప్పి నెగెటివిటీని ఎందుకు మూటగట్టుకోవడం అంటూ గీతా కృష్ణ తనదైన శైలిలో పంచ్‌లు వేశారు. గీతా గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత విజయ్, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చింది ఫ్యామిలీ స్టార్. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించిన కూడా ఎక్కువగా నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. అదంతా విజయ్ దేవరకొండ వల్లనే జరిగిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…