Varsha Reddy : తల్లి మృతితో రాజ‌కీయాల్లోకి హిమ వ‌ర్షా రెడ్డి.. జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్..?

Varsha Reddy : తల్లిదండ్రులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పని చేస్తుండ‌గా, తండ్రి ఫ్యాక్షన్ క‌క్ష‌ల‌ కారణంగా ఆమె ఏడాది వ‌య‌స్సులో ఉన్న‌ప్పుడే హాత్యకు గురయ్యాడు. ఇక తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దంపతులకు ఒకే కూతురు. అమెరికాలో ఎమ్మెస్ చేసింది.. మంచి ఉద్యోగం చేస్తుండగా తల్లి మృతి వార్త పిడుగుపాటులా మార‌డంతో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల బాటలోనే నడవాలని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది హిమ వ‌ర్షా రెడ్డి.

హిమవర్ష రెడ్డి, భర్త చంద్రశేఖర్‌ రెడ్డి రీసెంట్‌గా సీఎం జగన్మోహన్‌ రెడ్డిని కలిశారు. నీరజారెడ్డి బీజేపీలో రాష్ట్ర నాయకురాలిగా కొనసాగ‌గా, ఆమె కూతురు హిమవర్ష రెడ్డి సీఎం జగన్మోహన్‌ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలలోకి వస్తానని నీరజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో హిమవర్ష రెడ్డి ప్రకటించారు. ఏ పార్టీ తనకు అవకాశం ఇస్తుందో… ఆ పార్టీలోనే కొనసాగుతానని ఓ యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్యూలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రి జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి జయరాంకు చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షితో తలనొప్పి ఉంది. ప్రస్తుతం హిమవర్ష రెడ్డి మరో కుంపటి మొదలైన ట్టేనన్న చర్చ సాగుతోంది.

cm ys jagan may give ticket to Varsha Reddy
Varsha Reddy

హిమ వర్షా రెడ్డి ఆలూరు నుంచి పోటీ చేయవచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కోట్ల సుజాత పై హిమ వర్షా రెడ్డి పోటి చేయవచ్చని గత కొన్ని రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. తల్లిదండ్రుల మృతి హిమ వర్షా రెడ్డికి సానుభూతి పవనాలు ఉండవచ్చని టికెట్ విషయంపై ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదని ప్రచారం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యతగా ఆలూరు.. తర్వాత పత్తికొండ ఏదైనా పర్వాలేదని టికెట్ ఇస్తే గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తామని అంటున్నారు వర్షా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు. మ‌రి జ‌గ‌న్ ఆమెకి టికెట్ ఇస్తారా లేదా అన్న‌ది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago