Varsha Reddy : తల్లిదండ్రులు ఇద్దరు ఎమ్మెల్యేలుగా పని చేస్తుండగా, తండ్రి ఫ్యాక్షన్ కక్షల కారణంగా ఆమె ఏడాది వయస్సులో ఉన్నప్పుడే హాత్యకు గురయ్యాడు. ఇక తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. దంపతులకు ఒకే కూతురు. అమెరికాలో ఎమ్మెస్ చేసింది.. మంచి ఉద్యోగం చేస్తుండగా తల్లి మృతి వార్త పిడుగుపాటులా మారడంతో ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుంది. తల్లిదండ్రుల బాటలోనే నడవాలని రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది హిమ వర్షా రెడ్డి.
హిమవర్ష రెడ్డి, భర్త చంద్రశేఖర్ రెడ్డి రీసెంట్‌గా సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నీరజారెడ్డి బీజేపీలో రాష్ట్ర నాయకురాలిగా కొనసాగగా, ఆమె కూతురు హిమవర్ష రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలలోకి వస్తానని నీరజారెడ్డి వర్ధంతి కార్యక్రమంలో హిమవర్ష రెడ్డి ప్రకటించారు. ఏ పార్టీ తనకు అవకాశం ఇస్తుందో… ఆ పార్టీలోనే కొనసాగుతానని ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్యూలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జగన్‌ను కలవడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రి జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఇప్పటికే మంత్రి జయరాంకు చిప్పగిరి జడ్పీటీసీ విరుపాక్షితో తలనొప్పి ఉంది. ప్రస్తుతం హిమవర్ష రెడ్డి మరో కుంపటి మొదలైన ట్టేనన్న చర్చ సాగుతోంది.
హిమ వర్షా రెడ్డి ఆలూరు నుంచి పోటీ చేయవచ్చని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కోట్ల సుజాత పై హిమ వర్షా రెడ్డి పోటి చేయవచ్చని గత కొన్ని రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్ అయింది. తల్లిదండ్రుల మృతి హిమ వర్షా రెడ్డికి సానుభూతి పవనాలు ఉండవచ్చని టికెట్ విషయంపై ఇంకా ఫైనల్ డెసిషన్ రాలేదని ప్రచారం జరుగుతుంది. మొదటి ప్రాధాన్యతగా ఆలూరు.. తర్వాత పత్తికొండ ఏదైనా పర్వాలేదని టికెట్ ఇస్తే గెలిచి జగనన్నకు కానుకగా ఇస్తామని అంటున్నారు వర్షా రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు. మరి జగన్ ఆమెకి టికెట్ ఇస్తారా లేదా అన్నది రానున్న రోజులలో తెలియనుంది.