Niharika Konidela : మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ చివరిగా విరూపాక్ష చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద విజయం సాధించాడు. ఈ విజయంతో సాయిధరమ్ తేజ్‌కి ఫుల్ బూస్టింగ్ వచ్చింది. ఇక ఇదే ఉత్సాహంతో పవన్ కళ్యాణ్‌తో కలిసి బ్రో అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం జూలై 28న విడుదల కానుండగా, గత కొద్ది రోజులుగా మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ప్రమోషన్‌లో సరదాగా అభిమానులతో ముచ్చటించారు చిత్ర బృందం. తేజ్ వేదికపై మాట్లాడుతుండగా ‘‘పెళ్లి ఎప్పుడు?’’ అంటూ ప్రశ్నించారు. దానికి ఆయన ఫన్నీగా జవాబు చెప్పారు. ‘‘ఇంకెక్కడ పెళ్లి బ్రో. ఈ సినిమా ముందు వరకూ ఎవరో ఒకరు ట్రై చేేసవారు. కానీ, ఈ సినిమా టైటిల్ రిలీజ్ అయ్యాక అందరూ నన్ను బ్రో అని పిలుస్తున్నారు’’ అంటూ సాయిధరమ్ తేజ్ నవ్వులు పూయించారు.
బ్రో సినిమా నుండి సాయిధరమ్ తేజ్ పెళ్లిపై తెగ చర్చలు నడుస్తున్నాయి. ఆయనకు సంబంధించిన పాత వీడియోలు కూడా నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ చిత్ర ప్రమోషన్స్‌లో సాయిధరమ్ తేజ్, నిహారిక, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొనగా, ఇందులో నిహారిక అందరిని ఫన్నీ ప్రశ్నలు అడిగింది. అందులో భాగంగా నువ్వు ఎప్పుడైన డేట్ కి వెళ్లావా అని అడగగా, అందుకు లేదని సమాధానం ఇచ్చాడు. అయితే సాయి ధరమ్ తేజ్ ఎన్ని సార్లు తను ప్రేమలో లేనని చెప్పిన కూడా ఆయా హీరోయిన్స్‌తో ప్రేమలో ఉన్నట్టు ప్రచారాలు నడుస్తూ ఉంటాయి.
బ్రో సినిమాలో తన గురువు పవన్ కళ్యాణ్ గారితో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన సాయి ధరమ్ తేజ్.. తనకు పవన్ అవకాశం ఇవ్వడం వల్ల ఈ సినిమాలో భాగం అయ్యాను అని వెల్లడించారు. దేవుడు నాకు ఇచ్చిన సెకండ్ ఛాన్స్ ఇది. దయచేసి మీరందరూ జాగ్రతగా ఉండండి. చాలా మంది హెల్మెట్ పెట్టుకోవడం లేదు. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. మీరు క్షేమంగా ఉండాలని నేను కోరుకుంటున్నా’’ అని తేజ్ అన్నారు.ఇక ఈ మెగా హీరో ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకొని తర్వాత తిరిగి సినిమాలు చేయనున్నాడట.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…