Rayapati Aruna : జనసైనికురాలు రాయపాటి అరుణ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ జనసేన పార్టీని, ఆ పార్టీ అధ్యక్షుడిపై తప్పుడు వ్యాఖ్యలు చేసే వారికి తీవ్రంగా కౌంటర్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపాటి అరుణ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వల్లే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగలేకపోతున్నారని ఆమె అనడంతో మెగా ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. చిరంజీవి లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యల పట్ల రాయపాటి అరుణ తగ్గేదే లే అంటుంది. ‘‘ఈ విషయంలో నన్ను సాక్ష్యత్తూ నా అన్నలు అనుకున్న పవన్ కళ్యాణ్, నాగబాబు, చిరంజీవి అడిగిన సరే ‘క్షమాపణలు’ చెప్పను. మీరు పబ్లిక్‌గా పోస్టులు వేశారు కాబట్టి వీడియో పబ్లిక్‌గా పోస్ట్ చేస్తున్నా. పెద్దలు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఈ వీడియో ఇక్కడ పోస్ట్ చేయడం వల్ల ఇందుకు క్షమించండి.’’ అని రాయపాటి అరుణ ట్వీట్ చేశారు. అసలు విషయంలో చిరంజీవి యువత ఎందుకు ఎంటరైందని రాయపాటి అరుణ ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత అన్నయ్య చిరంజీవిని తాను ఎందుకు తప్పుగా అంటానని ప్రశ్నించారు.
మెగా ఫ్యామిలీని తాను ప్రొటక్ట్ చేసినట్లుగా ఇంకెవ్వరూ చేయట్లేదని, ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత క్షమాపణలు మీరు చెప్తారో.. నేను చెప్పాలో తెలుస్తుందని చిరంజీవి అభిమానులను ఉద్దేశించి అన్నారు. ఇదంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న మైండ్ గేమ్ అని.. ఈ ట్రాప్‌లో చిరంజీవి అభిమానులు పడ్డారని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో రాయపాటి అరుణ మాట్లాడే క్రమంలో.. మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. వివాదం శృతి మించుతుండగా నాగబాబు ట్వీట్ చేశారు. మంటలు చల్లార్చే ప్రయత్నం చేశారు. రాయపాటి అరుణ జనసేనకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. ఆమె ఆవేశంలో నోరు జారి ఒక మాట అన్నారు. అంతకు మించి దురుద్దేశం లేదు. రాయపాటి అరుణను నిందించడం ఆపాలంటూ సందేశం షేర్ చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…