Naga Babu : గత వారం బాక్సాఫీస్ దగ్గర విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బేబి. జూలై 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం చూసి అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బేబీ సినిమా ఇంత భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం సిని సెలెబ్రెటీలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే సాయి రాజేష్ ఈ సినిమాని ఓ హీరోకి చెప్పడానికి వెళ్లగా, ఆయన కథ వినకుండా వెనక్కి పంపించేశారని అన్నారు. విజయ్ దేవరకొండకు ఈ సినిమా చెప్పగానే ఆయన ఆనంద్ పేరు సజెస్ట్ చేశారని తెలిపారు.
బేబి సినిమాలో మెగా బ్రదర్ నాగబాబు హీరోయిన్ ఫాదర్ గా చేశాడు. ఇక ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో.. జులై 17న సక్సెస్ ఈవెంట్ ని ఏర్పాటు చేయగా, ఆ కార్యక్రమంలో నాగబాబు మాట్లాడుతూ మూవీ టీం మొత్తాన్ని అభినందించాడు. ఇక దర్శకుడు సాయి రాజేష్ అండ్ ఎస్‌కేఎన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ.. “వీరిద్దరూ సినిమా వర్క్ పరంగా నాకు చాలా ఇష్టం. ఇంకో లెవెల్ ఆఫ్ ఇష్టం ఏంటంటే.. వీరిద్దరూ మా జనసైనిక్స్. జనసేన కోసం చాలా పని చేస్తుంటారు. అయితే వీరిద్దరూ బయట పెద్దగా కనిపించరు అంతే. ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చెబుతున్నా” అంటూ చెప్పుకొచ్చారు నాగబాబు.
ఇక నిర్మాత అల్లు అరవింద్, ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. “విజయ్ దేవరకొండ తముడిగా ఆనంద్ ఈ సినిమాలో కనిపించలేదు. అతను కూడా ఇప్పుడు ఒక సెల్ఫ్ మెడ్ స్టార్. విజయ్ నువ్వు మీ తమ్ముడికి సరిగ్గా సపోర్ట్ చేస్తే ఒక మంచి నటుడిని ఇండస్ట్రీ ఇచ్చినట్లు అవుతుంది అని చెప్పుకొచ్చాడు. బేబి సినిమా ఫుల్ రన్ లో 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసినా ఆశ్చర్యపోనకవసరం లేదని విశ్లేషకులు అంటున్నారు. ఈ చిత్రంలో సినిమాలో ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్ అశ్విన్ మెయిన్ లీడ్ రోల్స్ చేశారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…