CM YS Jagan : వైసీపీ అధినేత జ‌గ‌న్ కుండి మార్పిడి చేయ‌బోతున్నారా.. ప్ర‌యోగం స‌ఫ‌ల‌మ‌వుతుందా..?

CM YS Jagan : మ‌రి కొద్ది రోజుల‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.పార్టీలు కొత్త ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తూ గెలుపు గుర్రం ఎక్కాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అధికారంలో ఉన్న వైసీపీ గ‌తంలో మాదిరిగా 175కి 175 సీట్లు గెల‌వాల‌ని త‌హ‌త‌హ‌లాడుతుంది. ఈ క్ర‌మంలోనే వైసీపీలో కుండమార్పిడి విధానం తప్పదనే అనిపిస్తోంది. పార్టీలో కుండమార్పిడి విధానం ఏమిటంటే ఎంఎల్ఏలు ఎంపీలుగా పోటీచేయటం ఎంపీలు ఎంఎల్ఏలుగా రంగంలోకి దిగటం అన్నమాట. స్ధానిక పరిస్ధితులు, ప్రజాప్రతినిధుల మీద ఉన్న వ్యతిరేకతని దృష్టిలో పెట్టుకొని జగన్ కుండమార్పిడి విధానానికి కొన్ని నియోజకవర్గాల్లో చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌.

సుమారు 10 నియోజకవర్గాల్లో అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉదాహ‌ర‌ణ‌కి నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డిని నెల్లూరు రూరల్ ఎంఎల్ఏగా పోటీచేయించబోతున్నారు. అలాగే ఇపుడు రాజ్యసభ ఎంపీగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిని రాబోయే ఎన్నికల్లో నెల్లూరు లోక్ సభకు పోటీచేయించాలని జగన్ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. అందుకు వేమిరెడ్డి కూడా సానుకూలంగానే స్పందించారు. ఇక కాకినాడ ఎంపీ వంగా గీత వచ్చేఎన్నికల్లో పిఠాపురం ఎంఎల్ఏగా పోటీచేసే అవకాశం ఉందని స‌మాచారం. మంత్రి పుంగనూరు ఎంఎల్ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా రాబోయే ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా పోటీకి దిగే అవకాశాలున్నాయట.

CM YS Jagan important decision on next one
CM YS Jagan

రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పుంగనూరు ఎంఎల్ఏగా పోటీచేస్తారని పార్టీలో టాక్. ఇల మొత్తంమీద సుమారు పదినియోజకవర్గాల్లో ఇలాంటి మార్పులుండవచ్చని నేతలకు సూచనలు అందుతున్నాయట.గ‌తంలోను ఇలాంటి ప్ర‌యోగాలు చేయ‌డం మ‌నం చూశాం. తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా ఉన్న నెలవుల సుబ్రమణ్యంను తర్వాత సూళ్ళూరుపేట ఎంఎల్ఏగా కాంగ్రెస్ అధిష్టానం పోటీచేయించింది. అలాగే 2014లో తిరుపతి ఎంపీగా గెలిచిన వరప్రసాద్ ను 2019 ఎన్నికల్లో గూడూరు ఎంఎల్ఏగా పోటీచేయించిన విషయం తెలిసిందే. మ‌రి ఇప్పుడు జ‌గ‌న్ చేస్తున్న ప్ర‌యోగం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుంద‌న్న‌ది తెలియాల్సి ఉంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago