Chinna Jeeyar Swamy : పాన్ ఇండియా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా జూన్ 16న విడుదల కానుండగా, ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జూన్ 6న… తిరుపతి వేదికగా అట్టహాసంగా జరిగింది. సినిమా టీమ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలివచ్చింది. అంతేకాదు అభిమాన నాయకుడిని కళ్లారా చూద్దామని వేలకొలది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. గోవింద నామస్మరణ జరిగే చోట.. జై శ్రీరామ్, జై సియారామ్ నినాదాలూ హోరెత్తాయి. వేడుకకి త్రిదండి చినజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అతిథులుగా హాజరయ్యారు.
ప్రభాస్ ఎంట్రీ సమయంలో.. బాణాసంచి పేలుళ్లతో గ్రౌండ్ అంతా సందడిగా మారింది. సినిమాకు ప్రాణంలా అనిపించే.. జై శ్రీరామ్ పాటను లైవ్‌లో ఆలపించింది అజయ్ అతుల్ అండ్ టీమ్. వారితో పాటు అశేష జనవాహిని సైతం.. గొంతు కలపడం విశేషం.అయితే చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్ కి తన ఆశీస్సులు అందించారు. ఈ తరానికి రామాయణ కథని అందించే ప్రయత్నం చేస్తున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ ని ప్రశంసించారు. శ్రీరాముడిని కీర్తిస్తూ శ్లోకంతో చినజీయర్ స్వామి తన ప్రసంగం ప్రారంభించారు. శ్రీరాముడు ఈ నేలపై నడయాడిన మహోన్నత రూపం అని ఆయన అన్నారు. బాహుబలి అయిన ప్రభాస్.. నిజమైన బాహుబలి శ్రీరాముడు అని లోకానికి నిరూపించడానికి వస్తున్నాడు.
శ్రీరాముడు మానవజాతికి ఆదర్శ పురుషుడు. రాముడిని మనుషులు ప్రేమించారు. పశువులు, పక్షులు కూడా ప్రేమించాయి. ఋషులు, రాక్షసులు కూడా ఎంతో ప్రేమించారు. ముక్కు చెవులు కోసిన శూర్పణఖ కూడా ప్రేమించింది. రాముడు అడవులకు వెళ్ళినప్పుడు ఆయన్ని అడవుల్లో వదిలిన రథం గుర్రాలు వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బలవంతంగా తీసుకెళ్లారు. అలాంటి రాముడి చరిత్రని ఈ తరానికి అందించబోతున్న ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ లకు అభినందనలు అని చినజీయర్ స్వామి అన్నారు. ప్రతి ఒక్క మనిషిలో రాముడు ఉంటాడు. ప్రభాస్ తనలోని రాముడిని పైకి తెస్తున్నారు. ఈ చిత్రాన్ని మీరంతా ఆదరిస్తే లోకం మొత్తం వ్యాపిస్తుంది అని చినజీయర్ స్వామి అన్నారు. చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలని అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…