Garikapati : చందమామ రావే జాబిల్లి రావే అంటూ తెలుగు సినీ సాహిత్యంలో పున్నమి వెన్నెలలు కురిపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి దాదాపు 800 సినిమాలలో 3000 పైచిలుకు పాటలు రాసారు. సిరివెన్నెల సినిమాలో ఆయన రాసిన ‘విధాత తలపున’ అనే పాటకు మంచిపేరుతోపాటు నంది అవార్డు దక్కింది. అంతేకాదు, ఆ సినిమా పేరే ఆయన ఇంటిపేరుగా ప్రసిద్ధి చెందింది. చాలామందికి ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రిగానే సుపరిచితులు. 1993లో వచ్చిన గాయం సినిమాలో ‘సురాజ్యమవలేని స్వరాజ్యం ఎందుకని’ అనే పాటతో మరోసారి సమాజం తీరుతెన్నులను వివరిస్తూ పాట రాసి అందరి ప్రశంసలు అందుకున్నారు సిరివెన్నెల.
శుభలగ్నం సినిమాలో ‘చిలక ఏ తోడు లేక’ అనే పాటతో కుటుంబం గురించిన ప్రాముఖ్యాన్ని వివరించారు. చక్రం సినిమాలో ‘జగమంత కుటుంబం నాది’, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని ‘మరీ అంతగా మహా వింతగా’ పాటలతో సినీ ప్రేమికులను, శ్రోతలను అలరించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30, 2021న తుది శ్వాస విడిచారు. ఆయన మరణం సాహిత్య లోకానికి తీరని లోటు. అయితే ఆయన పదాల అల్లిక గురించి గరికపాటి ఓ సందర్భంలో చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. బలపం బట్టి భామ బళ్లో అనే పాటలో అంఅః కంకః అనే విధంగా పద ప్రయోగం చేసిన ఏకైక కవి సిరివెన్నెల అని ఆయన అన్నారు.
జైజై గణేషా అనే పాట కూలీ నెం1 కోసం సిరివెన్నెల రాయగా, ఎలుక మీద ఆయన రాసిన పాటలోను చాలా అర్ధం ఉంది. ముజ్జగమలు తిప్పిందిరా, ముచ్చెమటలు కక్కిందిరా, అందువలన ఈ వరం దక్కింది అని ఆయన చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు అంటూ సిరివెన్నెలపై ప్రశంసలు కురిపించాడు గరికపాటి. కాగా, మూడున్నర దశాబ్దాలకు పైగా సినీ గీత రచయితగా అనేక చిత్ర విజయాలకు దోహదపడ్డారు. ఆయన రాసిన కొన్ని పాటలు సినిమాకు సంబంధించినవే అయినా, సమాజాన్ని సూటిగా ప్రశ్నించేలా ఉండేవి. పద విన్యాసాల కంటే భావానికే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే సిరివెన్నెల నేటితరం గీతరచయితలకు స్ఫూర్తిగా నిలిచారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…