Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల మయోసైటిస్ బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. గత ఏడాది యశోద సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న సమంత ఇటీవలే శాకుంతలం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమా ఊహించని విధంగా నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది.అయితే సమంత ఎంత బిజీ ఉన్నా కూడా వర్కవుట్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. ఫిట్ నెస్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనందరికీ తెలిసిందే.
ఆరోగ్యం ఎలా ఉన్నా వర్కవుట్స్ చేయడం, జిమ్‌కు వెళ్ళడం మానలేదు. షూటింగుల్లో ఉన్నా షెడ్యూల్ ప్రకారం సమంత జిమ్ చేయాల్సిందే. లేటెస్టుగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసిన సమంత… నెటిజనులు షాక్ ఇచ్చారు. ఒకటి… రెండు… మూడు… వంద! లెగ్స్ స్ట్రెంగ్త్ కోసం సమంత ఓ వ్యాయామం చేశారు. బాడీ వెయిట్ అంతా మోకాళ్ళ కింద భాగంలో పడేలా పాదాలను పైకి కిందకు కదిలిస్తారు. అంత ఇంటెన్స్ వర్కవుట్స్ సమంత చేయడం చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. మాయోసైటిస్ నుంచి కోలుకుంటున్న తరుణంలో ఆమె ధైర్యాన్ని, తెగింపును చూసి ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెబుతున్నారు.
సమంత జీరో సైజ్ ప్యాక్ కోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా చేస్తారు. తాజాగా ఆమె వర్క్ అవుట్ వీడియో మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అనారోగ్యం బారిన పడి కోలుకున్న సమంతని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. సమంత డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పడంతో పాటు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో పాటు ఖుషి సినిమాలో నటిస్తోంది.అలాగే హిందీ వెబ్ సిరీస్ అయిన సిటాడెల్ లో నటిస్తోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…