Bheemla Nayak : వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25 శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి రోజు నుండే వసూళ్ల పండగ మొదలయింది.సినిమా బాగుందనే టాక్ రావడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా సినిమా గురించి పవన్ నటన గురించి పాజిటివ్ స్పందన ఇవ్వడంతో ఫ్యాన్స్ మరింత ఖుషి అయ్యారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సహా చాలా మంది సినిమా ప్రముఖులు సినిమా బాగుందని చెప్పడంతో థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంది.
భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ లో తీసిన ఒక ఫోటో అప్పట్లో తెగ వైరల్ అయింది. పవన్ కళ్యాణ్ కెమెరా పట్టుకుని భీమ్లా నాయక్ సెట్ లో ఫోటో తీస్తుండగా ఆ ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది.ఈ ఫోటోలో హీరో రానాని, త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సాధారణంగా నవ్వుతూ ఫోటో తీసిన విధానం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇక భీమ్లా నాయక్ సినిమాని దాదాపు హైదరాబాద్‌లోనే షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం కొన్ని వీఎఫ్ ఎక్స్ కూడా వాడారని తెలుస్తుంది. టైటిల్ ట్రాక్‌లో పచ్చని చెట్లు, అడవులు అన్ని కూడా విజువల్ ఎఫెక్ట్స్ మాత్రమే.
అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్‌గా చిత్రం తెరకెక్కింది.. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా కరోనా వలన కొన్నాళ్లు వాయిదా పడింది. షూటింగ్ సమయంలోనూ త్రివిక్రమ్ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటున్నట్టు తెలుస్తుంది . సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించారు.. ఈ సినిమాలో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ అధికారి పాత్రను పవన్ కళ్యాణ్, అతనితో ఢీ కొట్టే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ పాత్రను రానా చేసారు. తమన్ సంగీతం అందించిన సంగీతం బాగుంది. నటీనటులు చాలా నేచురల్‌గా నటించి అలరించారు. చిత్రంలో అన్‌బిలీవబుల్ అనిపించే యాక్షన్ పార్ట్స్ ఇందులో ఉంటాయి. పవన్ కళ్యాణ్, రానా పోటా పోటీగా ఇందులో కలిసి నటించారు. అందుకే చిత్రం మంచి విజయం సాధించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…