Sr NTR : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు నటుడిగా, రాజకీయ నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గావించారు. ఆయన సినీ ప్రయాణంలో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే ఎన్నో సినిమాలు చేశారు. ఆయన సినిమాల్లో ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా కూడా ఒకటి. అంతేకాదు అన్నగారు నటించిన చివరి సినిమా కూడా ఇదే. అప్పట్లో ఈ సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శతాధిక చిత్రాల దర్శకుడు కే.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నందమూరి తారక రామారావు గారితో కలిసి నటించారు.
తెలుగులో సుమారు 300కు పైగా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎన్టీఆర్ నటించిన ఈ సినిమాని అప్పట్లో భారీ బడ్జెట్ తో తీశారు. సినిమాల్లో నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నగారు నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, ‘సామ్రాట్ అశోక’ వంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో చిరస్థాయిగా నిలిచిపోవాలని అందుకు తగ్గ ఓ కథ రాయమని మోహన్ బాబును అడిగితే మోహన్ బాబు వెంటనే ఈ పవర్ ఫుల్ కథను రెడీ చేశారు.ఎన్టీఆర్ ని మళ్ళీ సీఎం చైర్ పై కూర్చోబెట్టడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు.
రాజమండ్రి, అరకు లోయ, ఢిల్లీ, కులుమనాలి, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. అంతేకాదు చండీగర్ లోని ఆర్మీ జవాన్ల మధ్య కూడా ఈ చిత్ర షూటింగ్ జరిగింది. ఇక చివరి రోజు షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎన్టీఆర్ వెళుతుంటే చిత్ర యూనిట్ అంతా ఏడ్చేశారు . ఈ సినిమాకి కీరవాణి అందించిన సంగీతం సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలో ‘పుణ్యభూమి నాదేశం’ సాంగ్ లో అల్లూరి, సుభాష్ చంద్రబోస్, ఛత్రపతి శివాజీ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, గెటప్స్ లో ఎన్టీఆర్ కంపించడంతో అన్నగారి అభిమానులు, తెలుగు ప్రేక్షకులు తెగ ఆనందించారు. అప్పట్లో ఈ సినిమా చాలా కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తిరుపతిలో ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కూడా చేశారు. ఆ వేడుక కోసం ఎంతో మంది జనాలు తండోపతండాలులగా వచ్చారు. చాలా అట్టహాసంగా జరిగిన ఈ వేడుక అప్పట్లో హాట్ టాపిక్ అయింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…