CM YS Jagan : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనే ఏపీ ప్రభుత్వ శకటం అందరి దృష్టిని ఆకర్షించింది.75వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా జాతీయ జెండాలు వాడవాడల రెపరెపలాడాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఇతర కేంద్ర మంత్రులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక ఈ వేడుక పరేడ్ లో ప్రదర్శించిన శకటాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని ప్రదర్శించారు. ఏపీ విద్యా శకటానికి దేశం మొత్తం ఫిదా అయ్యింది.
ఏపీ లో గత నాలుగున్నరేళ్లగా విద్యకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వడమే గాక, ఖరీదైన ఇంటర్నేషనల్ బాకలారియెట్ వంటి సిలబస్ ను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయాలని సంకల్పించడం మనకు తెలిసిందే ఈ కాలంలో రాష్ట్రంలో విద్యారంగం సమూలంగా మారింది. ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు ప్రతి పల్లెకు చేరువయ్యాయి. ఇలా పేద పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆ సంస్కరణలకు అద్దం పట్టేలా రిపబ్లిక్ డే దినోత్సవం వేడుకల్లో విద్యా శకటాన్ని రూపొందించారు.
పాఠశాలల విద్యను మార్చడం- విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా పోటీపడేలా చేయడం” అనే ఇతివృత్తంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగంలో విప్లవాత్మకమైన సంస్కరణలు, వినూత్న పథకాలతో ప్రవేశపెట్టి కార్పొరేట్ స్కూల్స్ తో పోటీగా సర్కార్ బడులను అప్ గ్రేడ్ చేసింది. ఏపీ విద్యాకు సంబంధించిన 55 సెకన్ల నిడివిగ థీమ్ సాంగ్ తో ఈ శకటాన్ని ఢిల్లీ పరేడ్ లో ప్రదర్శించారు. ఇక విద్యార్థులతో నృత్యం చేయిస్తూ, విద్యా విలువను తెలియజేస్తూ..ఏపీ శకటం ముందుకు సాగింది. ఏపీ విద్యా శకటాన్ని చూసి దేశం మొత్తం ఫిదా అయింది. విదేశీయులు అయితే ఏకంగా క్లాప్స్ కూడా కొట్టారు. ప్రస్తుతం ఏపీ విద్యా శకటానికి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో పాటు అయోధ్య రాముడు, చంద్రయాన్-3 శకటాలు అందర్నీ ఆకర్షించాయి.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…