Chiranjeevi : నువ్వు వైసీపీ ఎంపీవా.. షాకైన చిరంజీవి..!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ అవార్డ్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవికి సంబంధించిన అనేక వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో అనేక వార్త‌లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇటీవ ల‌ విశాఖపట్నంలో సీనియర్ ఎన్టీఆర్ వర్థంతిని, అక్కినేని నాగేశ్వరరావు జయంతిని కలిపి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చిరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలుపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజాసేవ ధ్యాస తప్ప.. సంపాదనపై ధ్యాస లేని ఎంపీగా తనకు లావు శ్రీకృష్ణదేవరాయలు కనిపించారని కొనియాడారు.

విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ లావు రత్తయ్య తనయుడైన శ్రీకృష్ణదేవరాయలు గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఘనవిజయం సాధించారు. ఈ ఐదు సంవత్సరాల కాలంలో పార్టీలు, వర్గాలకు అతీతంగా గుంటూరు జిల్లాతోపాటు తన నియోజకవర్గ పరిధిలో ఎన్నో మంచి పనులు చేసి ప్రజల మనసు దోచుకున్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకృష్ణదేవరాయలు సినిమాల పరంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ కు నిజమైన వారసుడు చిరంజీవి అని ప్రశంసించారు. తన నటన, డ్యాన్స్ తో తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని, ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరంజీవిని ఏ ఒక్క వర్గానికి పరిమితం చేయకూడదని హితవు పలికారు.

Chiranjeevi surprised by this ysrcp mp
Chiranjeevi

వైసీపీ ఎంపీపై చిరంజీవి లాంటి గ్రేట్ పర్సనాలిటీ పొగడటంపై వైసీపీ పార్టీతోపాటు ఎన్టీఆర్, ఏఎన్నార్ అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఏనాడూ రూపాయి గురించి కృష్ణదేవరాయలు ఆలోచించలేదని, ప్రజలకు ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలన్నదే తన ధ్యేయంగా ఉండదని పార్టీ అభిమానులు చెబుతున్నారు. కాగా, లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాని మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల గొప్పతనాన్ని గుర్తు చేసుకున్నారు. అలానే ఎన్టీఆర్ తనకి ఇచ్చిన ఓ సలహా గురంచి చిరు ప్రస్తావించారు. కష్టపడి సంపాదించిన డబ్బును విలాసవంతమైన వస్తువుల మీద కాకుండా స్థలాల మీద ఖర్చు చేయాలని ఎన్టీఆర్ తనకి సలహా ఇచ్చారని చిరు అన్నారు. అప్పుడు అది పాటించడం వల్లే ఈరోజు అవి తన కుటుంబాన్ని కాపాడుతున్నాయన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago