YS Sharmila : షర్మిళ ఏపీలో తెగ సందడి చేస్తుంది. వైసీపీపై విరుచుకుపడుతూ తెగ హంగామా చేస్తుంది. అయితే జగన్‌ని విమర్శిస్తున్న షర్మిల..జగన్ రాజన్న వారసుడు కాదని పేర్కొంది. వైఎస్.. మాట మీద నిలబడే నాయకుడు.. జగన్ మాత్రం మాట తప్పే నాయకుడు.. ఇచ్చిన ప్రతి మాటా తప్పిన జగన్, మాటకు కట్టుబడే వైఎ్‌సకు వారసుడెలా అవుతారు..’ అని ఆయన చెల్లెలు, పీసీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సూటిగా ప్రశ్నించారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై మోశానని, జగనన్న రాజకీయ భవిష్యత్ కోసం 3,200 కి.మీ. పాదయాత్ర చేశానని.. వైసీపీని గెలిపించానని.. ఆయన కోసం అనేక ఇబ్బందులకు ఓర్చాననని.. అయినా కనీసం కృతజ్ఞత లేదని దుయ్యబట్టారు. అధికారం చేపట్టగానే జగనన్న మారిపోయారన్నారు.
ఇవాళ తనమీద, తన వ్యక్తిగత జీవితం మీద నానారకాలుగా దాడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తాను భయపడనని, తాను వైఎస్ బిడ్డనని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని 2014లో తిరుపతిలో మోదీ హామీ ఇచ్చారని.. కాంగ్రెస్ ఇచ్చే ఐదేళ్ల వ్యవధి సరిపోదని, పదేళ్లపాటు హోదాకావాలన్నారని.. పదిహేనేళ్లు కావాలని ఇదేచోట చంద్రబాబు కూడా అడిగారని.. బీజేపీ అధికారంలోకి వస్తే హోదా ఇస్తామని చెప్పిన మాట ఏమైందని మోదీని ప్రశ్నిస్తున్నానని షర్మిల అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన చేసింది అన్యాయం.. పాపమని స్పష్టం చేశారు. ‘ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ర్టానికి ఎన్నో పరిశ్రమలు వచ్చేవి. లక్షల ఉద్యోగాలు వచ్చేవి. పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ జాతీయ హోదా కల్పించి 90శాతం నిధులు ఇస్తామంది.
మోదీ ప్రభుత్వం నిధులివ్వలేదు. రాజధాని నిర్మాణానికి సహకారమివ్వలేదు. దక్షిణాదిన మెట్రో రైలు ప్రాజెక్టు లేని ఏకైక రాష్ట్రం ఏపీయే. ఆంధ్ర ప్రజలు అంత తీసిపోయారా? రాష్ట్ర ప్రజలను మోదీ కడుపులో పొడిచారు. అయినా జగనన్న, చంద్రబాబు బీజేపీకి బానిసలయ్యారు. మోదీ రాష్ట్రానికి హోదా ఇచ్చారని బానిసలయ్యారా? ప్రాజెక్టులిచ్చారని భజన చేస్తున్నారా? వీళ్లు బానిసలై.. ఆంధ్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందువల్లే ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఏపీలో రాజ్యమేలుతోంది. రాయలసీమలో 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించే హంద్రీ-నీవా ప్రాజెక్టుకు వైఎస్ హయాంలో రూ.4,500 కోట్లు ఖర్చుచేసి.. 90శాతం పనులు పూర్తిచేస్తే, మిగిలిన పది శాతం పనులు పూర్తిచేయడం జగనన్నకు చేతకావడం లేదు అని షర్మిళ పేర్కొంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…