IPL : ఐపీఎల్ 2024 ర‌ద్దు కానుందా.. షాక్‌లో ఫ్యాన్స్

IPL : ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ నిర్వహణపై కాస్త సందిగ్ధత ఉంది. ఈ ఏడాది దేశంలో లోక్‍సభ ఎన్నికలు జరగనుండటంతో ఐపీఎల్‍ను బీసీసీఐ స్వదేశంలోనే నిర్వహిస్తుందా.. వేరే దేశానికి వేదికను మారుస్తుందా అనే దానిపై ఇంకా క్లారిటీ అనేది రావ‌డం లేదు. ఎన్నికలు ఉన్నా భారత్‍లోనే ఈ ఏడాది ఐపీఎల్‍ను నిర్వహించేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని సమాచారం బయటికి వచ్చింది. మార్చి నుండి మే చివరి వారం దాకా జరగాల్సి ఉన్న ఈ మెగా లీగ్‌ను భారత్‌లో సాధారణ ఎన్నికల దృష్ట్యా విదేశాల్లో నిర్వహించేందుకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) సన్నాహకాలు చేస్తున్నదని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఈసారి సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్‌ను తమ దేశంలో నిర్వహించాలని శ్రీలంక ఇదివరకే భారత్‌ను కోరింది. ఈ నేపథ్యంలో అసలు ఐపీఎల్‌ భారత్‌లోనే జరుగుతుందా..? షిఫ్ట్‌ అవుతుందా..? అన్నదానిపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఐపీఎల్ షిఫ్టింగ్ విష‌యంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. ఐపీఎల్‌ భారత్‌లోనే జరుగుతుందా..? లేక షిఫ్ట్‌ అవుతుందా..? అనేది సెంట్రల్‌ హోమ్‌ అఫైర్స్‌ మినిస్ట్రీ నిర్ణయించాల్సి ఉంది. అయితే ఏ విషయమైనా చర్చల తర్వాతే తెలుస్తుంది..’ అని అన్నాడు.

is ipl going to move out of india this year
IPL

ఇక వచ్చేనెల నుంచి మొదలుకానున్న ఉమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)ను ఈసారి రెండు నగరాల్లో నిర్వహించనున్నట్టు శుక్లా స్పష్టం చేశాడు. గత సీజన్‌లో ఒక్క ముంబైలోనే జరిగిన మ్యాచ్‌లను ఈసారి బెంగళూరు, ఢిల్లీలలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపాడు. ఐపీఎల్ 2024 సీజన్‍ను మార్చి 22వ తేదీన ప్రారంభించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే, లోక్‍సభ ఎన్నికల షెడ్యూల్‍ను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తోంది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ వెల్లడించాక ఈ విషయంపై స్పష్టత రానుంది.లోక్‍సభ ఎన్నికల వల్ల 2009 ఐపీఎల్ సీజన్‍ను దక్షిణాఫ్రికాలో నిర్వహించింది బీసీసీఐ. అయితే, 2014, 2019లో ఎన్నికలు ఉన్నా.. భారత్‍లోనే ఐపీఎల్‍ను జరిపింది. మరి.. ఇప్పుడు 2024లో ఐపీఎల్‍ను స్వదేశంలోనే నిర్వహిస్తుందా.. లేదా వేరే దేశానికి తరలిస్తుందా అనేది వేచిచూడాలి.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

12 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

19 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

3 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago