YS Sharmila : ఏపీ ప్రజలకు ప్రధాని మోడీ అన్యాయం చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చారని..పదేళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడిగారని గుర్తు చేశారు. ఏపీ ప్రత్యేక హోదాను తేవడంలో చంద్రబాబు, జగన్ విఫలమయ్యారన్నారు షర్మిల. జగన్ మూడు రాజధానులని గందరగోళంచేశారని షర్మిల ఆరోపించారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా కాకుండా ఒక్కో సైన్యంలాగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
వైసీపీ పార్టీని సొంత భుజాన వేసుకొని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్న షర్మిల ఇప్పుడు ఆ పార్టీ నుంచి దాడులను ఎదుర్కొంటున్నానన్నారు. వైఎస్ బిడ్డగా పుట్టింటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నానని అన్నారు. ఇంకా ఎలాంటి త్యాగానికైనా, పోరాటానికైనా రెడీ అని అన్నారు. సీపీఎస్ అమలు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెడతామన్న షర్మిల ఇదే తిరుపతిలో 2014లో మోడీ 10 సంవత్సరాల ప్రత్యేక హోదా హామీ ఇచ్చారని గుర్తు చేశారు. రామమందిరం కట్టిన నరేంద్ర మోడీ మరి ఇక్కడ దేవస్థానం ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోటి అనే వ్యక్తి హోదా కోసం తిరుపతిలో ఆత్మాహత్య చేసుకున్నారని షర్మిల తెలియజేశారు. మోడీ, చంద్రబాబుల గుంపు అలీబాబా అరడజను దొంగల గుంపుగా మారిందన్నారు.
ప్రజలకిచ్చిన ప్రతి మాట తప్పిన జగన్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. వైఎస్సార్, జగనన్న పాలనకు ఆకాశం, పాతాళానికి ఉన్న తేడా ఉందని ఆరోపించారు. ‘ వైసీపీ, జగనన్న కోసం ఎంతో కష్టపడ్డ. కనీసం కృతజ్ఞత లేకుండా వ్యక్తిగత జీవితంపై దాడి చేస్తున్నారని పేర్కొన్నారు. నా పుట్టింటికి వచ్చి రాజకీయం చేస్తున్నా. ఎంతటి త్యాగానికైనా పోరాటానికైనా సిద్ధమేనని ప్రకటించారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…