CM Revanth Reddy : అసెంబ్లీలో అడుగుపెట్టిన కేసీఆర్.. రేవంత్ రెడ్డికి గ‌ట్టి పంచ్‌లు విసురుతున్నాడుగా..!

CM Revanth Reddy : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీలో గజ్వేల్ శాసనసభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల తుంటి శస్త్ర చికిత్స జరిగిన ఆయన చేతి కర్ర సహాయంతో తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ అసెంబ్లీ వద్ద కేసీఆర్ కు స్వాగతం పలుకుతూ ఆయ‌న‌ని అసెంబ్లీలోకి ఆహ్వనించారు. ఇక అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కెసిఆర్ తో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గజ్వేల్ నియోజకవర్గం నుండి మూడు సార్లు జరిగిన శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన కెసిఆర్, రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన నిర్వహించారు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా, శాసనసభా పక్ష నేతగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రను పోషించబోతున్నారు. కేసీఆర్‌తో స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ ప్రమాణం చేయించారు. అనంతరం అసెంబ్లీ లాబీల్లో పార్టీ నేతలందరినీ కేసీఆర్‌ కలిశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం కేసీఆర్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌ నివాసానికి వెళ్లారు. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో కలిసి భోజనం చేశారు. అనంతరం అందరితో సమావేశమయ్యారు. దేశ రాజకీయాలు, రాబోయే పార్లమెంట్‌ ఎన్నికలు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన తదితర అంశాలపై చర్చించారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు.

CM Revanth Reddy strong comments on kcr
CM Revanth Reddy

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన అసెంబ్లీ గేట్ నెంబర్ వన్ ద్వారా రాకపోకలు సాగించారు. అయితే రీసెంట్‌గా మాత్రం కేసీఆర్ గేట్ నెంబర్ 2 ద్వారా ఆయన అసెంబ్లీకి రావడం గమనార్హం. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేరుగా ఆయన ప్రతిపక్ష నేత కార్యాలయంలో పూజలు చేసి, శాసనసభాపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డిపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలపై దృష్టిపెట్టాలని కేసీఆర్‌ సూచించినట్టు సమాచారం. ఇచ్చిన హామీలను అమలు చేయడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అంత ఈజీ కాదని వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీల అమలుకు అవసరమయ్యే నిధులు సమకూర్చుకోవడం పెద్ద టాస్క్‌ అని పేర్కొన్నారు. రాబోయే 4-5 నెలలు వేచి చూడాలని, కాంగ్రెస్‌ తన కార్యాచరణను ఎలా అమలు చేస్తుందో చూసి ప్రజాక్షేత్రంలో వారి డొల్లతనాన్ని బయటపెట్టాలని సూచించారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago