CM Revanth Reddy : అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఫైర్.. తండ్రి, కొడుకుల‌ని వ‌ణికించాడుగా..!

CM Revanth Reddy : తెలంగాణలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జ‌ర‌గ‌డం మ‌నం చూశాం. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టామన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే శ్వేతపత్రం విడుదల చేసామన్నారు సీఎం. అర్హులైన వారికి సంక్షేమం అందించి దేశంలోనే తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలబెట్టడమే మా లక్ష్యమన్నారు రేవంత్ రెడ్డి. ఆదాయం, అవసరాలకు సంబంధించి రిజర్వు బ్యాంకు వద్ద నుంచి వివరాలు తీసుకున్నామన్నారు.

బీఆర్ఎస్ కు అధికారం అప్పగించే నాటికి.. రిజర్వ్ బ్యాంకు వద్ద మన నిధుల నిల్వలు సగటున 303 రోజులు ఉండేవన్నారు. బీఆరెస్ అధికారంలోకి వచ్చాక సగటున ఇందులో సగం రోజులు కూడా లేవని తెలిపారు. రోజూ అప్పు కావాలని వాళ్ల దగ్గర నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.శ్వేత పత్రం ఎవరినో కించపరచడానికి… అవమానించడానికి కాదన్నారు. మేం ప్రకటించిన గ్యారంటీలను ఎగ్గొట్టడానికి కాదన్నారు. వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించేందుకే ఈ శ్వేతపత్రం విడుదల చేశామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్ధిక శాఖ కార్యదర్శి సంతకం పెట్టి ఇచ్చిందే ఈ నివేదిక అన్నారు. మీకు ఏవైనా అపోహలు ఉంటే తొలగించుకోవాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం ప్రధానిని కలిసేందుకు కిషన్ రెడ్డిగారికి తాను ఫోన్ చేశానన్నారు. స్వార్ధ రాజాకీయాల కోసం కాకుండా ప్రజల కోసం మేం ఆలోచిస్తున్నామన్నారు.

CM Revanth Reddy angry comments on kcr and ktr
CM Revanth Reddy

కేసీఆర్ కు రాజకీయంగా అవకాశం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ.. ఎంపీగా, కేంద్రమంత్రిగా కేసీఆర్ కు కాంగ్రెస్ ఛాన్స్ ఇచ్చింది.. పోతిరెడ్డిపాడు గురించి.. పీజేఆర్ ఒక్కరే పోరాటం చేశారు. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్లు ఎవరూ కొట్లాడలేదు. ఐదేళ్ల సమయం ఉంది.. ఏమేమి జరిగిందో.. అన్నీ లెక్కలతో సహా వివరిస్తాం. 9 ఏళ్ల పాలనపై ఎక్స్ రే తీసినట్లు అన్నీ బయటపెడతాం’ అని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

11 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

1 day ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago