Konda Surekha : ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఎంత రసవత్తరంగా నడుస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. సిద్దిపేట హరిత హోటల్లో మంత్రి కొండ సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ మధ్య శనివారం వాగ్వాదం జరిగింది. దీంతో రాజేశ్వర్ రెడ్డి సమీక్ష సమావేశం నుంచి ఉన్నట్టుండి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకులను స్టేజి మీదకు పిలిచే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. సిద్దిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ నేతను స్టేజీ పైకి పిలిచారు. ఓడిపోయిన వారిని స్టేజీ మీదకి ఎలా పిలుస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే పల్లా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొమురవెల్లి జాతర ఏర్పాట్లపై హరిత హోటల్లో ప్రభుత్వ అధికారిక సమీక్షలో కాంగ్రెస్ నేత కొమ్మూరిని స్టేజీపైకి పిలిచారు మంత్రి కొండా సురేఖ. అయితే దీనికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అభ్యంతరం చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదని.. రాజకీయ వేదిక లాగా ఓడిపోయిన వారిని స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొదట మంత్రి కొండా సురేఖ.. ఎమ్మెల్యే పల్లాకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ నేత వినలేదు. దాంతో విసుగు చెందిన కొండా సురేఖ.. మీరు ఉంటే ఉండండి, లేదంటే వెళ్ళిపొండి అని చెప్పేశారు. తన మాటలకు విలువ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ పార్టీ సమావేశంలాగ ఓడిన వారిని స్టేజీపైకి ఎలా పిలుస్తారంటూ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కొమరవెల్లి మల్లన్న జాతర సమీక్ష సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ పోరు మళ్లీ మొదలైందని ప్రజల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్లికార్జున స్వామిని దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ సమావేశాన్ని హోటల్లో పెట్టలేదన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కూడా వెళ్లిపొమ్మనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. తమ హయాంలో ఇలా ఎప్పుడూ రాజకీయాలను ఉపయోగించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…