CM KCR : ప్రస్తుతం ఎలక్షన్స్ ప్రచారాలు జోరుగా జరుగుతున్నాయి. చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పార్టీ అధినాయకులు ప్రజలలోకి వెళుతూ వరాలు ప్రకటిస్తున్నారు. అలానే ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అయితే కేసీఆర్ స్వయంగా ఆ పార్టీ ఎంఎల్ఏపై ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.కూసుమంచి మండలం జీళ్లచెరువులో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పాలేరు నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభకు అపూర్వ ఆదరణ లభించింది. సభకు నియోజకవర్గం వ్యాప్తంగా నలుమూలల నుంచి ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అయితే అంత పెద్ద ఎత్తున జనాలు వచ్చిన కూడా వారి కోసం ఎంఎల్ఏ కందాల సరైన ఏర్పాట్లు చేయకపోవడంపై కేసీఆర్ మండిపడ్డారు. అందరి ముందే ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగానికి పాలేరు నియోజకవర్గ ప్రజలు ఫిదా అయిపోయాయి. సభ అద్భుతంగా విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో కూడా జోష్ పెరిగింది. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్‌ఎస్ నేతలు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రేయింబవళ్లూ శ్రమించి జన ప్రభంజనం సృష్టించారు .మధ్యాహ్నం మూడు గంటల వరకు వాహనాల తాకిడి కొనసాగింది. సభకు వేలాదిమందితో రావడంతో ఎమ్మెల్యే కందాళను సీఎం కేసీఆర్ ప్రశంసలతో ముంచెత్తారు.
తక్కువ మాట్లాడడం, ఎక్కువ పని చేయడం ఎమ్మెల్మే కందాళ నైజమంటూ ప్రశంసించారు. అదే క్రమంలో మరోసారి కూడా కందాళకు భారీ మెజార్టీ అందించాలని సీఎం పిలుపునివ్వడంతో ఒక్కసారిగా ప్రజలు నిలబడి తమ సంపూర్ణ మద్దతును తెలిపారు. దళిత మిత్రులకు నమవి చేస్తున్నా. పాలేరు నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నారు.. మాకు దళితబంధు ఇవ్వాలని ఉపేందర్ రెడ్డి అడిగారు. ఉపేందర్ రెడ్డిని ఏకపక్షంగా గెలిపించుకుంటే.. మొత్తం నియోజకవర్గానికి దళితబంధు పెట్టించే బాధ్యత నాది. నేనే స్వయంగా వచ్చి హుజురాబాద్‌లో మాదిరిగానే ఈ పథకాన్ని అమలు చేస్తాను. ఈ కోట్లు, నోట్లు పట్టుకువచ్చేతోడు ఏం చేయడు. అదే దళితబంధు వస్తే ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు వస్తాయి. దశలవారీగా అయినా సరే చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం. ఉపేందర్ రెడ్డిని అసెంబ్లీకి పంపించండి.. దళితబంధు తీసుకొచ్చే బాధ్యత నాది అని కేసీఆర్ స్పష్టం చేశారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…