Pawan Kalyan And Anna Lezhneva : జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన తన వర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చి వరుణ్ తేజ్ పెళ్లికి హాజరయ్యేందుకు ఇటలీకి పయనం అయ్యారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోలు వైరల్‌గా మారాయి.మెగాప్రిన్స్ వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మెగా హీరోలు ఇటలీ చేరుకుంటున్నారు. ఇప్పటికే వరుణ్ -లావణ్య లు ఇటలీకి వారం రోజులు ముందుగానే చేరుకున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ తన సతీమణి ఆనా తో కలిసి ఇటలీ వెళ్లారు. డిఫరెంట్ లుక్ లో విమానాశ్రయంలోని తన సతీమణి లెజ్నేవాతో తో కలిసి పవన్ ఎంట్రీ ఇస్తున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 1 న ఇటలీలో జరగనుంది. వీరి వివాహం కోసం మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా ఇటలీ చేరుకుంటున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ ఇటలీ వెళ్లారు. పవన్ దంపతులతో పాటుగా నిహారిక కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. పవన్ తన సతీమణి లెజ్నేవాతో తో కలిసి విమానాశ్రయం చేరుకున్నారు. పవన్ కాటన్ జీన్స్… మల్టీకలర్ గళ్ల షర్ట్ ధరించి కనిపిస్తున్నారు. చేతిలో నల్ల జాకెట్ కూడా ఉంది. చాలా కాలం తరువాత కొత్త గెటప్ లో పవన్ కనిపిస్తుండటంతో ఈ పొటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వివాహానికి పవన్ కళ్యాణ్ హాజరు అవుతారా లేదా అని అనుకున్నారు కానీ, అతను తన పనులను పక్కన పెట్టి, ఈ వివాహానికి హాజరు అవుతూ వున్నారు.
కొద్ది రోజుల క్రితం పవన్ అన్నా విడిపోయినట్టు ప్రచారం జరిగింది. కాని తాజాగా ఈ ఫొటోలు ఆ వార్తలకి చెక్ పెట్టాయి. ఇద్దరు కలిసే ఉన్నారని, వారు విడిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం అని వీటిని చూసిన వారు ఒక ఐడియాకి వచ్చారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నారు. హైదరాబాదులోని నాగబాబు ఇంట్లో కొన్ని నెలల క్రితం నిశ్చితార్ధం జరిగింది. ఇప్పుడు ఇటలీలో వివాహం జరగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్…వెడ్డింగ్ కార్డు వైరల్ అవుతున్నాయి.నవంబర్ 5న వరుణ్, లావణ్యల రిసెప్షన్ జరగనున్న విషయం తెలిసిందే.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…