Naveen : సీనియర్ నటుడు నరేష్ ఇటీవలి కాలంలో తెగ వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ఆయన పవిత్ర లోకేష్‌తో నడుపుతున్న వ్యవహారంపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరు ఎన్ని విమర్శలు చేసిన కూడా వారిద్దరు ఎంచక్కా చక్కర్లు కొడుతున్నారు. ఇద్దరు కలిసి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా చేశారు. ఓ రోజు నరేష్, పవిత్ర హోటల్ రూమ్ లో కనిపించడంతో నరేష్, పవిత్రలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మూడో భార్య రమ్య. అప్పటి నుంచి పలు సార్లు వీరి మధ్య పోలీస్ కేసులు నడిచాయి. నరేష్ రమ్య మీద, రమ్య నరేష్ మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరి వ్యవహారం ఓ టీవీ సీరియల్‌లా సాగుతుంది. కొద్ది రోజులుగా కాస్త శాంతించినట్టు కనిపిస్తున్నా ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు.
తాజాగా నరేష్- పవిత్ర లోకేష్ గురించి నరేష్ తనయుడు నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మానాన్న పెళ్లి గురించి మేం ఏం అనుకుంటున్నాం అనేది చాలా ముఖ్యం. బయటి వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారు? అనేది మాకు ముఖ్యం కాదు. ఎందుకంటే అది మా ఓపీనియన్ కాదు. బయటి వాళ్ల ఒపినియన్స్ కన్సిడర్ చేయలేం. ఆయన నిర్ణయం, ఆయన సమస్య, ఆయనే చూసుకుంటారు. ఆయన కొడుకుగా నా నిర్ణయాన్ని తను అడిగితే అప్పుడు చెప్తాను. నాకంటే ఆయనే తన లైఫ్ ను బాగా చూసుకోగలడు. పవిత్ర లోకేష్ గారు నాకు చాలా కాలంగా తెలుసు. చాలాసార్లు మాట్లాడాను. తను చాలా మంచి వ్యక్తి. ఆమె లాంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. ఎప్పుడైనా తను చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమెను పవిత్ర గారు అని పిలుస్తాను” అని నవీన్ చెప్పారు.
నాన్నని నేను ఎప్పుడు ఏ సాయం అడగలేదు. ఆయనకి చాలా తక్కువగా టచ్‌లో ఉంటాను. ఎప్పుడో ఒకసారి మాట్లాడతాను. అయితే నాన్నకి అవసరం వచ్చినప్పుడు తన దగ్గరకి తప్పక వెళతాను అని పేర్కొన్నాడు. ఇక నవీన్ విషయానికి వస్తే .. 2016లో విడుదలైన నందిని నర్సింగ్ హోమ్ సినిమాతో హీరో అయ్యాడు ఈయన. దానికి ముందు కీర్తి సురేష్ హీరోగా వచ్చిన ఐనా యిష్టం నువ్వు అనే సినిమా విడుదల కాలేదు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని గతేడాది అవసరాల శ్రీనివాస్‌తో కలిసి ఊరంతా అనుకుంటున్నారులో నటించాడు.అందులో బాగానే ఉన్నాడు.. కానీ ఏడాది తిరిగేలోపు మారిపోయాడు.. కనీసం గుర్తు పట్టలేనంతగా లావు అయిపోయాడు నవీన్. ఈయన్ని చూసిన వాళ్ళంతా వామ్మో అనుకుంటున్నారు. నటుడు కాకముందు కూడా ఇలాగే ఉన్నాడు నవీన్. మధ్యలో సినిమా కోసం తగ్గాడు.. ఇప్పుడు తీరు చూస్తుంటే సినిమాలు ఇక చాలు అనుకుంటున్నట్లు అనిపిస్తుంది. తొలి సినిమాతోనే నిరాశ పర్చిన నవీన్.. రెండో సినిమా కూడా పెద్దగా ఊపు ఇవ్వలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…