CM Chandra Babu : విద్యార్థులు, డ్వాక్రా మ‌హిళ‌ల‌కు ఎల‌క్ట్రిక్ సైకిల్స్‌.. గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్ర‌బాబు..

CM Chandra Babu : డ్వాక్రా మహిళలు, విద్యార్థులకు ఎలక్ట్రిక్‌ సైకిళ్లను సబ్సిడీతో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఇఇఎస్‌ఎల్‌) సిఇఒ విశాల్‌ కపూర్ ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది. ఏపీ సీఎం చంద్రబాబు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు.. ఆయన సుదీర్ఘ ప్రసంగాన్ని గమనిస్తే ఒక విషయం స్పష్టం అవుతుంది. ఆయన టెక్నాలజీని ఉపయోగించి, ఆ ప్రయోజనాలను ప్రజలకు కల్పించేందుకు ప్లాన్స్ వేస్తుంటారు. తాజాగా అదే విషయాన్ని బయటపెట్టారు. టీడీపీ గుర్తు అయిన సైకిళ్లను సబ్సిడీ ధరలకు ఇస్తే ఎలా ఉంటుంది అని ఆయన ఆలోచిస్తున్నారు. ఐతే.. ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది.

అవి మామూలు సైకిళ్లు కాదు. ఎలక్ట్రిక్ సైకిళ్లు. అంటే ఆయన తన ప్లాన్‌లో టెక్నాలజీని యాడ్ చేసుకున్నారనుకోవచ్చు .. ఎలక్ట్రికల్‌ సైకిల్‌ మోడళ్లను ముఖ్యమంత్రికి చూపించడంతో పాటు పలు అంశాలపై ఆయనతో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎపిని బెస్ట్‌ ఎనర్జీ ఎఫిషియంట్‌ (ఉత్తమ ఇంధన సామర్ధ్యం) రాష్ట్రంగా మార్చుతామన్నారు. ఇఇఎస్‌ఎల్‌తో గృహ నిర్మాణం, ఇంధన, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, మున్సిపల్‌ సహా పలు కీలక విభాగాలు కలిసి పనిచేస్తాయని తెలిపారు. ప్రజలకు, ప్రభుత్వానికి ఆర్థికంగా, పర్యావరణ పరంగా లబ్ధిచేకూరేలా విధానాలు ఉండాలని, ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఆర్‌టిసిలోనూ పెద్దయెత్తున విద్యుత్‌ వాహనాలను ప్రమోట్‌ చేస్తున్నామని, ప్రభుత్వ భవనాల్లోనూ సోలార్‌ వినియోగం పెంచబోతున్నట్లు తెలిపారు.

CM Chandra Babu to give cycles to students and dwacra women
CM Chandra Babu

ఎలక్ట్రిక్ సైకిళ్లు పర్యావరణానికి హాని చెయ్యవు. అంతేకాదు.. విద్యార్థులు త్వరగా స్కూళ్లు, కాలేజీలకు వెళ్తారు. బస్సుల కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. అలాగే మహిళలు సైకిళ్లను ఉపయోగించుకొని త్వరగా గమ్య స్థానాలకు చేరతారు. అలాగే వారి ఉపాధి అవసరాలకు ఆ సైకిళ్లను ఉపయోగించుకుంటారు. . ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదల కోసం నిర్మించే ఇళ్లకు ఇంధన సామర్ధ్య విద్యుత్ పరికరాల్ని సబ్సిడీపై ఇవ్వాలనుకుంటున్నారు. తద్వారా పేదలకు నాణ్యమైన విద్యుత్ పరికరాల్ని తక్కువ ధరకే పొందగలరు. అలాగే సీఎం చంద్రబాబు.. ప్రభుత్వ భవనాల్లో సోలార్ విద్యుత్‌ని వాడేలా ప్లాన్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago