MLC Kavitha : ఎమ్మెల్సీ క‌విత జైలు నుంచి ఎట్ట‌కేల‌కు రిలీజ్‌.. ఫుల్ జోష్‌లో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు..

MLC Kavitha : ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌లో బీఆర్ఎస్ పార్టీ దారుణ‌మైన ఓట‌మి చ‌విచూసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత క‌విత అరెస్ట్ కూడా ఆ పార్టీని బాగా కుంగ‌దీసేలా చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు నేడు బెయిల్ మంజూరు చేసింది. కవితను అరెస్టు చేసి నేటికి 164 రోజులు కాగా.. జ్యుడిషీయల్ కస్టడీలో భాగంగా ఆమె 153 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్నారు. అయితే క‌విత పిటిషన్ విచారణకు రాగా.. జస్టిస్ గవాయ్, విశ్వానాథ్‌లతో కూడిన ధర్మాసనం ఆణెకు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈడీ, సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. సుమారు 2 గంటల పాటు ఇరువైపుల వాడీవేడీ వాదనలు జరగ్గా.. కవిత తరపు లాయర్ ముఖుల్ రోహత్గి వినిపించిన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది.

దీంతో.. మహిళగా బెయిల్‌కు కవిత అర్హురాలని ధర్మాసనం అభిప్రాయపడింది.. ఈడీ, సీబీఐ కేసులో కవితకు షరతులతో కూడిన బెయిల్‌‌ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ఒక్కో కేసుకు రూ.10 లక్షల చొప్పున రెండు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యులను ప్రభావితం చేయొద్దని, కవిత పాస్‌పోర్ట్‌ను కూడా అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఇన్నాళ్లు జైలులో ఉన్న క‌విత ఇప్పుడు విడుద‌ల కానుండ‌డంతో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఉత్సాహం క‌నిపిస్తుంది. జూలై 16న కవిత తొలిసారి అస్వస్థత‌కు గుర‌య్యారు. దీంతో ఆమెను ఢిల్లీలోని దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. జడ్జి అనుమతితో జూలై 18న ఎయిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు.

MLC Kavitha finally released now what about BRS party
MLC Kavitha

ఆగ‌స్టు 22న క‌విత మరోసారి అస్వస్థత‌కు గుర‌య్యారు. వైరల్ ఫీవర్‌తో పాటు, గైనిక్ సమస్యలతో బాధపడటంతో ఆమెను ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. భర్త అనిల్‌ సమక్షంలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు తిరిగి జైలుకు తరలించారు.ఇటీవ‌ల రుణ‌మాఫీ విష‌యంలో బీఆర్ఎస్ పార్టీలో కాస్త ఉత్సాహం నెలకొన‌గా, ఇప్పుడు క‌విత జైలు నుండి విడుద‌ల కానుండ‌డంతో బీఆర్ఎస్ శ్రేణులు మళ్లీ పుంజుకోబోతున్న‌ట్టు తెలుస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

13 hours ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

20 hours ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

2 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

2 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

2 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

3 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

4 days ago

మ‌హేష్ బాబు లుక్ చూశారా.. అదిరిపోయాడుగా..!

గుంటూరు కారంతో చివ‌రిగా ప‌ల‌క‌రించిన మ‌హేష్ బాబు గ‌త కొద్ది రోజులుగా రాజ‌మౌళి మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటూ…

4 days ago