Chiranjeevi : స్వయంకృషితో ఇండస్ట్రీలో ఎదిగిన చిరంజీవి ఒక్కో మెట్టు ఎక్కుతూ మెగాస్టార్ గా ఎదిగాడు. ఎంతో కష్టపడితే కానీ చిరు ఈ స్థాయికి చేరుకోలేదు. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే చిరు రాజకీయాలలోకి వెళ్లాడు. ప్రజరాజ్యం పార్టీ స్థాపించి కొద్ది రోజులకే దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశాడు. అయితే దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాలలోకి వచ్చిన చిరంజీవి దూసుకుపోతున్నాడు. కుర్రాళ్లకి పోటీగా సినిమాలు చేస్తున్నాడు. అయితే మళ్లీ చిరంజీవి రాజకీయాలలోకి వెళతడా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు.
ట్విట్టర్ ద్వారా మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన 10 సెకన్ల ఆడియో చర్చనీయాంశంగా మారింది. నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ.. రాజకీయం నా నుంచి దూరం కాలేదు.. అని ఆ ఆడియోలో చిరంజీవి చెప్పారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వ్యాఖ్యలపై మెగా అభిమానులు, కామెంట్స్ చేస్తున్నారు. మనకు రాజకీయాలు వద్దు బాస్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ డైలాగ్‌కు సంబంధించిన ఆడియోను చిరు ట్విటర్‌గా వేదికగా పంచుకోగా.. నిమిషాల్లోనే వైరల్ అయింది. ఈ ఆడియోకి గాడ్‌ఫాదర్ ఫొటో ఉండడంతో.. సినిమాలోని డైలాగ్ అని ఫాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా గాడ్‌ఫాదర్. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, హీరో సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న గాడ్‌ఫాదర్ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…