Mahesh Babu : టాలీవుడ్ స్టార్ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు కాగా ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ షేర్ చేస్తూ తన ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటారు. సినిమా సినిమాకు మేకోవర్ మార్చుకుంటూ కొత్తగా కనిపిస్తున్న మహేష్ తాజాగా తన లేటెస్ట్ ఐఫోన్ 14 మాక్స్ ప్రొ మొబైల్ తో దిగిన సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కి మాంచి కిక్ ఇచ్చాడు. మహేశ్ సెల్ఫీ స్టిల్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ లుక్‌లో మహేష్‌ని చూసి ప్రతి ఒక్కరు స్టన్ అవుతున్నారు.
ఈ పిక్‌లో మహేష్ మరీ చిన్న పిల్లాడిలా ఉన్నాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రాబోతోన్న SSMB 28 సినిమా అప్డేట్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. SSMB 28 ఆరంభం అంటూ వదిలిన వీడియో, అందులో మహేష్ బాబు లుక్, తమన్ బీజీఏం అన్నీ కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు మహేష్. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. హాలీవుడ్ తరహాలో ఈ సినిమా ఉంటుందని చెప్పడంతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం పాన్ వరల్డ్ అని అంతా ఫిక్స్ అయిపోయారు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా, వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళతారనే టాక్ నడుస్తుంది. బాహుబలి ప్రాంఛైజీ, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగు హీరోలకి అంతర్జాతీయ స్థాయిలో స్టార్‌డమ్ తెచ్చిపెట్టాడు జక్కన్న. మరి మహేశ్ ఇమేజ్‌ను ఏ స్థాయికి తీసుకెళ్తాడా అని అందరూ ముచ్చటించుకుంటున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…