Chiranjeevi : ఒకపక్క ఇండస్ట్రీలో రామారావు, నాగేశ్వరరావు ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే కొణిదెల శివకుమార్ అనే కుర్రాడు మొగల్తూరు నుంచి మద్రాసులో అడుగుపెట్టి నేడు మెగాస్టార్ గా ఎదిగాడు. చిరంజీవి మొదట నటించిన చిత్రం పునాదిరాళ్లు అయినప్పటికీ ప్రాణం ఖరీదు ముందు రిలీజ్ అయింది. చిరు ఇప్పటికి 150కి పైగా సినిమాల్లో నటించాడు. సినీ డాన్సుకి డెఫినేషన్ చెప్పిన నటుడు చిరంజీవి. యాక్టింగ్ లో చిరు ఈజ్, డాన్స్ లో ఆయన చరిష్మా ఎవరికి రాదనే చెప్పవచ్చు. 80’s, 90’s లో చిరంజీవి సినిమా ఇండస్ట్రీని ఏలాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు ఎంతోమంది ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. రీ ఎంట్రీ తరువాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
ముఖ్యంగా తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత వరకు చిరంజీవి పేరు మారు మ్రోగుతుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే చిరంజీవి సినిమాల్లోకి రాకముందు ఎలా ఉండేవారు..? ఆయన లుక్ ఎలా ఉండేది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. తాజాగా చిరంజీవి చిన్నప్పటి మిత్రుడు అప్పట్లో చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నెల్లూరు నగరంలో జనసేన నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి పవనన్న ప్రజాబాట పేరిట ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ తరుణంలోన ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆయనకు అరుదైన ఫోటోలు లభించాయి.
మెగాస్టార్ చిరంజీవి చిన్ననాటి స్నేహితుడు నటరాజ్‌ను కేతంరెడ్డి కలిశారు. నటరాజ్ చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. చిరంజీవి అసలు పేరు శివశంకర వర ప్రసాద్ నేను చాలా క్లోజ్. ఒంగోలులో మేము డిగ్రీ చదివేటప్పుడు ఫోటో అని భద్రంగా దాచుకున్న ఫోటోను చూపించాడు. యవ్వనంలో ఉన్న చిరంజీవి ఫోటో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను కేతంరెడ్డి, వినోద్‌రెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఫోటో, ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…