Krishna : సూపర్ స్టార్ కృష్ణ నవంబర్ 15న స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఆయన మృతి ఎంతో మందిని కలిచి వేసింది. కృష్ణ మృతిని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నిర్మాతల మనిషిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు. కృష్ణ చేసిన మూవీ ప్లాపై నిర్మాత నష్టపోతే అతనికి ఫ్రీగా ఒక సినిమా చేసేవారట. అడిగినవారికి అడిగినంత ఇచ్చేసేవారట. స్నేహం పేరుతో కృష్ణ వద్ద డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వని వారు కూడా ఎందరో ఉన్నారట. సినిమా పరిశ్రమనే జీవిత అనుకొని సినిమాల విషయంలో ఎన్నో ప్రయోగాలు చేశారు కృష్ణ. ఆయనకు కొన్ని కొన్ని చిత్రాలు తీవ్ర నష్టాలు మిగిల్చాయి.
1965లో తేనె మనసులు చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన కృష్ణ టాలీవుడ్లో కొత్త శకం మొదలుపెట్టారు. కృష్ణ సినిమా రిలీజ్ అవుతుంటే పల్లెటూర్లలో మొత్తం బండ్లల్లో బయలుదేరే వారు గ్రామస్తులు. ఇక అంతలా పాపులారిటీ దక్కించుకున్న కృష్ణ ఆర్థికంగా ఓ రేంజ్‌లో ఉండాలి కాని ఆయన ఏనాడు డబ్బు కోసం వెంపర్లాడలేదు. డబ్బు మనిషి అస్సలు కాదు. నలుగురికి సాయపడాలని ఎప్పుడు భావిస్తుంటారు. సూపర్ స్టార్ కృష్ణ సంపాదించిన ఆస్తుల విలువ ఎంత అంటే రూ.400 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
డబ్బు విషయంలో అమాయకత్వం ,సెటిల్మెంట్స్ విషయంలో మధ్యవర్తిగా ఉండడం , కీలక సమయంలో కొన్ని సినిమాలు ఫెయిల్ అవ్వడంతో కోట్లాది రూపాయలను నష్టపోయారు కృష్ణ. లేకుంటే ఆయన ఆస్తి సుమారుగా రూ. 500 కోట్లకు పైగా ఉండేదని అంచనా.. కానీ ఈయన వారసుడు మహేష్ బాబు మాత్రం ఏకంగా రూ.1300 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.అయితే కృష్ణ వీలునామా రాయగా, అందులో తన మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా తన ఆస్తి చెందాలని వీలునామాలో రాశారట. ఇక స్టెప్ సన్ నరేష్‌పై ఒక్క రూపాయి రాయలేదట. విజయనిర్మల ఆస్తులు ఎలాగు నరేష్‌కి చెందుతాయి కాబట్టి ఇలాంటి నిర్ణయం కృష్ణ తీసుకున్నారని టాక్.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…