Super Star Krishna : తెలుగు సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది.నట శేఖర కృష్ణ నంబర్ 15న స్వర్గస్తులు కాగా, ఆయన మరణం ఎంతో మందిని కలిచివేసింది. కృష్ణని కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో తొలిసారి ఈస్ట్‌మన్ కలర్, 70 ఎంఎం, సినిమా స్కోప్, కౌబాయ్, జేమ్స్ బాండ్ మూవీలు తీసిన ఘనత కృష్ణ సొంతం. సూపర్ స్టార్,మెగాస్టార్ వంటి బిరుదులు ఆ రోజుల్లో సొంతం చేసుకోవడం అంత ఆషామాషీ కాదు. కాని కృష్ణ మాత్రం సూపర్ స్టార్ ట్యాగ్ దక్కించుకొని ఓ వెలుగు వెలిగారు.
నిజానికి అభిమానులే కృష్ణను సూపర్ స్టార్‌ను చేసింది. అది కూడా తమ ఓట్ల ద్వారా కావడం విశేషం. మోసగాళ్లకు మోసగాడు, అల్లూరి సీతారామరాజు, ఈనాడులాంటి విలక్షణమైన సినిమాలు చేసిన కృష్ణను అభిమానులు ఎంతగానో ఆదరిస్తున్న క్రమంలో అప్పట్లో ఓ తెలుగు, తమిళ మ్యాగజైన్ ఒకటి ఓ పోల్ నిర్వహించింది. పోస్ట్ ద్వారా ఓట్లు వేసి మరీ తమ అభిప్రాయాలను చెప్పాలి. అలా సూపర్ స్టార్ ఆఫ్ ద ఇయర్ ఎవరు అన్న పోల్‌ను ప్రతి ఏటా ఆ మ్యాగజైన్ నిర్వహించేది.
ఇందులో వరుసగా ఐదేళ్ల పాటు కృష్ణ టాప్‌లో నిలవడం విశేషం. దీంతో అప్పటి నుంచి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కృష్ణను సూపర్ స్టార్ అని పిలవడం మొదలుపెట్టారు. రెండేళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో స్వయంగా కృష్ణనే ఈ విషయాన్ని కృష్ణనే స్వయంగా వెల్లడించాడు. ప్రొడ్యూసర్ల హీరోగా కృష్ణకు మంచి పేరుంది. తనను నమ్మి సినిమా చేసిన నిర్మాత ఎప్పుడూ బాగుండాలని కోరుకునే మొదటి వ్యక్తి కృష్ణ. ఒక సినిమా ఫ్లాపయి సదరు నిర్మాత కష్టాల్లో పడితే.. తర్వాతి సినిమాను ఫ్రీగా చేసిపెట్టి హిట్ ఇచ్చిన మొనగాడు మన సూపర్ స్టార్ కృష్ణ. ఆయన లేరనే విషయాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…