Adipurush : యంగ్ రెబల్ స్టార్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా.. టీజర్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శకుడు ఓం రౌత్ బొమ్మలతో గారడీ చేశారంటూ విమర్శలు గుప్పించారు.. టీజర్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ చాలా చీప్ గా ఉన్నాయని , ఈ వీఎఫ్ఎక్స్ కన్నా.. చోటా భీమ్ లాంటి కార్టూన్స్‌లో యానిమేషన్ చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు. టీజర్ లో విజువల్ ఎఫెక్ట్స్ తేలిపోయానని, ప్రభాస్ లుక్, సైఫ్ లుక్ అస్సలు బాగోలేదనే కామెంట్స్ వినిపించాయి. దీంతో ప్రభాస్ టీమ్ పునరాలోచనలో పడిందట.
హనుమంతుడు, రావణాసురుడు కనిపించిన విధానం, చాలా మందికి విమర్శలు గుప్పించేలా చేయడంతో దర్శకుడు ఓం రౌత్ సినిమాని వాయిదా వేసి దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టాడు. రావణాసురుడి లుక్ మతపరంగాను కొంత మంది మనోభావాలు దెబ్బతీస్తుందని భావించి, రావణ్‌గా కనిపించే ప్రతి సన్నివేశాన్ని రీషూట్ చేయడం కష్టం కాబట్టి సైఫ్ గడ్డాన్ని వీఎఫ్ఎక్స్ ద్వారా తొలగించే ప్రయత్నం చేస్తున్నారట. గత అవుట్‌పుట్ తప్పిదాలను వెతికి మరీ కొత్త అవుట్‌పుట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందుకోసం ఏకంగా 100 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం.
సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని ప్లాన్ చేసిన చిత్ర యూనిట్.. ఈ వర్క్స్ కారణంగా సినిమాను వాయిదా వేసారు. జూన్ 16, 2023న విడుదల కానుందని ప్రకటించారు. ఆదిపురుష్ కోసం భారీ తారాగణం ఎంచుకున్న దర్శకనిర్మాతలు.. సైఫ్ అలీఖాన్, దేవదత్త నాగె, సన్నీ సింగ్ లను ఈ ప్రాజెక్టులో భాగం చేశారు. దీంతో ఈ సినిమాపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు రెబల్ స్టార్ అభిమానులు. అయితే ఫ్యాన్స్ అంచనాలు రీచ్ అయ్యేలా ఈ మూవీ ఉంటుందని చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. రామాయణం ఆధారంగా రాబోతున్న ఈ ఆదిపురుష్ సినిమాను 3D ఫార్మాట్ లో కూడా విడుదల చేయనుండటం విశేషం. తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ గా విడుదల కానుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…