Jayaprada : కేవలం ఆ ఒక పొరపాటు వల్లనే జయప్రద తెలుగు చిత్రాలకు దూరమయ్యారా..?

Jayaprada : అందానికి అసలైన చిరునామా ఆమె. భూమికోసం చిత్రంతో తెలుగు తెరపై తలుక్కుమని మెరిసిన తార. సాంఘిక చిత్రాలలోనే కాకుండా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక  ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు జయప్రద. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు రాజకీయాలలోకి కూడా ఎంట్రీ ఇచ్చారు జయప్రద. ఆ తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూనే పలు సినిమాల్లో నటించారు. జయప్రద బిజెపి పార్టీ తరపున ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ సందర్భంలో ఆమె ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి వెల్లడించారు. సీనియర్ ఎన్టీఆర్ తో ఆమెకు ఉన్నటువంటి అనుబంధం గురించి ఇంటర్వ్యూ  ద్వారా పంచుకున్నారు జయప్రద.

చిన్నప్పటినుండి ఆయన్ను చూస్తూ పెరిగాను. ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాక ఎన్టీఆర్ నుంచి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఎన్టీఆర్ తో తనకున్న అనుబంధాన్ని చెప్పుకుంటూనే  ఎన్టీఆర్ గారు నాకు రోల్ మోడల్ అని జయప్రద వెల్లడించారు.  ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు ఫోన్ చేసి పార్టీలో చేరమని చెబితే ఆలోచించకుండా టిడిపి పార్టీ తరఫున ప్రచారం నిర్వహించాను. కానీ ఎలాంటి పదవులను కూడా ఆశించలేదని, కేవలం ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది నా ప్రధాన లక్ష్యమని జయప్రద తెలియజేశారు.

Jayaprada mistake she left telugu movies why
Jayaprada

నేను రాజకీయాల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు టిడిపిని చేతిలోకి తీసుకున్న వెంటనే ఎన్టీఆర్ ను వదిలి ఎంతో మంది ఎమ్మెల్యేలు బలవంతం మీదనే ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి చంద్రబాబును సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంలోనే నేను కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. ఇదే నా జీవితం లో మొదటి సారిగా నేను చేసిన అతి పెద్ద పొరపాటు.

ఎన్టీఆర్ నన్ను నమ్మి పార్టీలోకి ఆహ్వానిస్తే, ఆయన దగ్గర ఉండాల్సిన నేను తప్పుడు నిర్ణయం తీసుకొని బయటకు వచ్చాను అని జయప్రద తెలియజేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో కొనసాగానని, ఆ తర్వాత పార్టీలో అనేక మార్పులు చేర్పుల వల్ల నాకు కనీస గౌరవం కూడా ఇవ్వలేదని, దీంతో పార్టీ వదిలివేసి బయటకు వెళ్లాల్సి వచ్చిందని జయప్రద ఇంటర్వ్యూ ద్వారా తెలియజేశారు.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago