Chiranjeevi : వరుణ్ తేజ్‌ని నిశ్చితార్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరు లావణ్య త్రిపాఠికి సంబంధించి తెగ వెతుకులాట మొదలు పెట్టారు. ఆమె పాత వీడియోలు ఒకసారి బయటకు తీయడం,మెగా ఫ్యామిలీని కలిసినప్పుడు వారు ఈ అమ్మడు గురించి ఎలా స్పందించారు, వారిపై లావణ్య త్రిపాఠి ఎలా స్పందించింది అనే వాటిగురించి చర్చిస్తున్నారు. లావణ్య త్రిపాఠి ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని ఓ ఈవెంట్లో కలవగా ఆ రోజు ఆయన ఈ అమ్మడిపై ప్రశంసలు కురిపించాడు. లావణ్య స్మైల్ చాలా బాగుంటుంది. ఆ సొట్ట బుగ్గలు చాలా నచ్చుతాయి. భలే భలే మగాడివోయ్ చిత్రంలో నీ నటన చాలా బాగుంది అని మెచ్చుకున్నారు చిరు.
నీకు మంచి భవిష్యత్ ఉంటుందని కూడా ఆ రోజు చిరు చెప్పుకొచ్చారు. అయితే ఈ అమ్మడు ఈ రోజు మెగా కోడలిగా వెళ్లి చిరంజీవి ఫ్యామిలీ సభ్యులలో ఒకరిగా మారింది. జూన్ 9న అంటే శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్, అల్లు అరవింద్, వైష్ణవ్ తేజ్ తోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొంది. ఇక వీరి నిశ్చితార్థం సందర్భంగా ఈ జంటకు మెగాస్టార్ చిరంజీవితోపాటు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, మంచు లక్ష్మీ, ప్రగ్యా జైశ్వాల్, కోన వెంకట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం తన సోషల్ మీడియా ద్వారా బ్యూటీఫుల్ నోట్ రాసుకొచ్చారు. “నిశ్చితార్థంతో ఒక్కటైన వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు. మీరు అద్భుతమైన జంటగా నిలుస్తారు. అందరి ప్రేమాభిమానాలతో మీ జీవితం సంతోషంగా సాగాలని కోరుకుంటున్నా” అని మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగనున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…