Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఆయన ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారు. అయితే చిరంజీవి చాలా మందికి ఇన్సిపిరేషన్. ఆయనని చూసి ఎంతో మంది ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవి స్పూర్తితో వచ్చిన చాలా మంది స్టార్స్‌గా కూడా ఎదిగారు. సినిమా మీద ప్యాషన్‌తో కష్టపడే ప్రతి ఒక్కరికీ తన వంతు సాయం చేయడంలో చిరు ముందుంటారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా చిరు అండగా నిలబడ్డారు. గెటప్ శ్రీను హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమాను ఆదరించాలంటూ చిరంజీవి ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో గెటప్ శ్రీను గురించి చాలా గొప్పగా మాట్లాడారు.
గెటప్ శ్రీను పేరు తలచుకోగానే జబర్దస్త్‌లో రకరకాల గెటప్‌లు, హావభావాలు, గొంతులు, యాసల్లో నటిస్తూ, నవ్వించే నటుడు మన కళ్ల మందు కదులుతాడు. ఈ తరం యువ కమెడియన్లలో నాకు బాగా నచ్చిన వ్యక్తి గెటప్ శీను. ఇప్పుడు తను హీరోగా వస్తున్న చిత్రం రాజు యాదవ్. ట్రైలర్ చూశాను.. ఏదో కొత్తదనం తప్పకుండా ఉంటుందన చూసిన నాకు బావుందనిపించింది. శ్రీను చూపించిన అభినయం మనల్ని నవ్విస్తుంది.. కవ్విస్తుంది. శ్రీనును చూస్తుంటే నాకు గతంలో ఒక కామెడీ హీరో ఉండేవారు.. ఆయన పేరు చలం. ఆయన్ను ఆరోజల్లో ఆంధ్రా దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా అలానే అనిపిస్తాడు. తన టాలెంట్‌కి లిమిటేషన్స్ లేవు.
మే 24న రిలీజ్ కాబోయే రాజు యాదవ్ సినిమా మీకు బాగా నచ్చుతుందని.. హీరోగా సక్సెస్ అందుకుంటాడని నేను నమ్ముతున్నాను. చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్” అంటూ మెగాస్టార్ విష్ చేశారు. గెటప్ శ్రీను టాలీవుడ్‌లో హీరోగా ఆరంగేట్రం చేస్తున్నాడు. అలాగే ఈ మూవీతో కృష్ణమాచారి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు.సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై కె. ప్రశాంత్ రెడ్డి, రాజేష్ కల్లెపల్లి సంయుక్తంగా రాజు యాదవ్ సినిమాను నిర్మించారు. అయితే శ్రీనుని చూస్తుంటే నాకు గతంలో కామెడీ హీరో చలం గారు గుర్తుకు వస్తారు. చలం గారిని ఆంధ్ర దిలీప్ కుమార్ అని పిలిచేవారు. మన గెటప్ శ్రీను కూడా నాకు అలానే అనిపిస్తారు” అని చిరంజీవి అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…