Dil Raju : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆయనపై ఇటీవల మెగా ఫ్యాన్స్ ఎంతగా విరుచుకుపడ్డారో మనం చూశాం. పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేఖంగా వైసీపీ నాయకుడికి అల్లు అర్జున్ ప్రచారం చేయడం పట్ల మెగా ఫ్యాన్స్ తో పాటు నాగబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదే సమయంలో దిల్ రాజు చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దిల్ రాజు సెకండ్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 2లో వస్తోన్న మూవీ లవ్ మీ.
ఆశీష్, వైష్ణవి చైతన్య జోడీగా తెరకెక్కుతోన్న ఈ మూవీతో అరుణ్ భీమవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. లవ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో ఈ సినిమా జూన్ 25న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. హర్రర్ కి లవ్ డోస్ ఇచ్చి ఒక డిఫరెంట్ కథాంశం చూపించబోతున్నారు. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య సెకండ్ మూవీగా ఇది వస్తుండటంతో ఆసక్తి నెలకొంది. అలాగే ఆశీష్ కి కూడా ఇది రెండో సినిమానే. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించగా పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేశారు. స్టార్ మేకర్స్ వర్క్ చేయడంతో కచ్చితంగా లవ్ మీ సినిమాలో ఏదో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుందనే మాట వినిపిస్తోంది.
అయితే లవ్ మీ ఈవెంట్‌లో దిల్ రాజు మాట్లాడుతూ.. అల్లు అర్జున్ ప్రతి సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు. నువ్వు జనాల ఆదరణ దక్కించుకోవాలి అంటే చాలా కష్టపడాలి అని చెప్పుకొచ్చాడు. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఫలితం ఉంటుందని దిల్ రాజు చెప్పడంతో ఆశీష్ కూడా అందుకు ఓకే అన్నట్టుగా తెలిపాడు. ఇప్పుడు దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…