కొద్ది రోజుల క్రితం జరిగిన అలయ్ భలయ్ కార్యక్రమంలో గరికపాటి.. మెగాస్టార్ చిరంజీవి పై అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చిరంజీవితో మహిళా అభిమానులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటే.. అది ఆపమని, లేదంటే తాను వెళ్లిపోతానంటూ మండిపడ్డాడు. గరికపాటి అలా అన్నా కూడా చిరంజీవి ఎంతో వినమ్రంగా ఆయనకు నమస్కరించి గరికపాటి గొప్పదనం గురించి చెప్పుకొచ్చాడు. ఆ తరువాత నాగబాబు ఎంట్రీ, మెగా అభిమానులు, చిరు భక్తుల ఎంట్రీతో కథ మారిపోయింది. గరికపాటిని తెగ ట్రోల్ చేసి చిరు పవర్ ఏంటో చూపించారు.
ఇక ఈ వివాదం అంత సద్దుమణిగింది అనుకున్న సమయంలో గరికపాటి నరసింహారావుకు చల్లగా చురక అంటించారు మెగాస్టార్ . ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవితో ఫోటోలు దిగడానికి మహిళలు ఆసక్తి చూపిన నేపథ్యంలో… ఇక్కడ ఆయన లేరు కదా, అంటూ సెటైర్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొందరేమో చిరు టైమింగ్‌ను చూసి ఇష్టపడుతుంటే.. మళ్లీ గెలకడం అవసరమా? అంటూ ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు.దీనిపై గరికపాటి ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.
చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రమోషన్స్‌లో ఈ విషయం మీద ప్రస్థావించాడు. మనల్ని ఒక మాట అంటే.. మనం వెంటనే రియాక్ట్ అవ్వాల్సిన పని లేదు.. ఆయన పెద్ద వారు.. అంటూ గరికపాటి మీద కామెంట్ చేశాడు. ఎప్పుడు ఏ విషయంపైనైన చిరంజీవి చాలా సున్నితంగా స్పందిస్తారు. సందర్భం వచ్చినప్పుడు మాత్రం మెల్లగా చురక అంటిస్తారు. ఇప్పుడు అలానే చేశారు. ఇక చిరు ప్రస్తుతం వాల్తేరు వీరయ్య చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కి సంబంధించి టీజర్ రీసెంట్‌గా విడుదల కాగా, ఇది ప్రేక్షకులకి మాంచి కిక్ ఇచ్చింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…