కొబ్బరికాయ కొట్టిన‌ప్పుడు కుళ్లిపోయి ఉంటే ఏం జ‌రుగుతుంది.. పువ్వు వ‌స్తే ఏమ‌వుతుంది..?

పూజ చేసాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది మన ఆచారం. పూజ పూర్తయ్యాక టెంకాయ కొట్టేసాము, నైవేద్యం పెట్టేసాము తంతు పూర్తి అయింది అని అనుకుంటాము. కానీ టెంకాయ కొట్టడంలో కూడా ఒక పద్దతి ఉంది. టెంకాయ కొట్టడం అంటే శాంతి కారకం, అరిష్ట నాశకం. శాస్త్ర ప్రకారం కొబ్బరికాయ కొట్టడంలో కొన్ని నియమాలున్నాయి. కొందరికి కొబ్బరికాయ సరిగ్గా పగులుతుంది అంటే వారికి టెక్నిక్ అర్థం అయి ఉంటుంది. లేదా వారు శ్రద్ధగా కొట్టి ఉండవచ్చు. కొంతమంది మనసులో ఆందోళనలు, భయాలతో కొబ్బరికాయలు కొడతారు.

అలాంటప్పుడు అది అడ్డదిడ్డంగా పగులుతుంది. దీన్ని మంచి లేదా చెడుకు అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. ఇక కొంతమంది కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతుంది. దీన్ని చెడుగా భావిస్తారు. కొబ్బరికాయ కుళ్ళిపోతే కాళ్ళు, చేతులు కడుక్కుని పూజామందిరాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టడం మంచిది. అలాగే కొంతమంది వాహనాలకు పూజ చేసి కొబ్బరికాయ కొడుతుంటారు. ఇలాంటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా వాహనాన్ని శుభ్రం చేసి మరొక కొబ్బరికాయ కొట్టాలి.

coconut breaking at god flower and spoil what happens

ఇలా కొట్టడం వలన మంచి జరుగుతుంది. అలాగే కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు వస్తే మంచి జరుగుతుందని అర్థం. కొత్తగా పెళ్లయిన వారికి ఇలా పువ్వు వస్తే వారి జీవితం సుఖసంతోషాలతో సంతాన వృద్ధి కలుగుతుంది. ఇక కొబ్బరికాయ నిలువుగా పడవ ఆకారంలో పగిలితే ఆ ఇంట్లో ఉన్న కోడలు లేదా కూతురుకి గర్భధారణ జరగబోతుందని నమ్ముతారు. ఇలా కొబ్బరికాయ కొట్టినప్పుడు మంచి మనసుతో ధర్మమైన కోరికలతో కొట్టడం వలన అవి నెరవేరుతాయి. చెడు ఆలోచనలతో ఆందోళన, భయాలతో కొట్టడం వలన అవి నెరవేరవు. అందుకే దేవునిపై మనసు పెట్టి మంచిని మాత్రమే కోరుకోవాలి.

Share
Usha Rani

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago