యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు ప్రభాస్. షార్ట్ టైంలోనే ప్రభాస్‌కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ రావడంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నాడు. కృష్ణం రాజు వారసుడిగా హీరోగా అడుగు పెట్టిన ప్రభాస్… ఆ తర్వాత స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే ప్రభాస్.. కృష్ణంరాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన తండ్రికి కూడా సినిమా పరిశ్రమలో ఎన్నో మంచి సంబంధాలు ఉన్నాయి. ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజుకి మంచి డైనమిక్ నిర్మాతగా పేరు ఉండేది.
ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ అన్నయ్య కృష్ణంరాజుకు చేదోడు వాదోడుగా ఉంటూ గోపికృష్ణ మూవీస్ స్థాపించాడు. అదేవిధంగా కొడుకు భవిష్యత్ కోసం చేయని ప్రయత్నం లేదు. సూర్యనారాయణ ఊహించని విధంగా 2010 ఫిబ్రవరి 12న మరణించాడు. భర్త మరణంతో బాగా కుమిలిపోయిన శివకుమారి కూడా అస్వస్థతకి గురయ్యారు. అయితే ప్రభాస్ ఆ సమయంలో చాలా కుమిలిపోయాడు. అయితే ప్రభాస్ తండ్రి తన కొడుకుని మహారాజుగా చూడాలని అనుకున్నారట. కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు ప్రభాస్‌కు అలా రాజు పాత్రలో నటించే అవకాశం రాలేదు.
ఇటీవల బాహుబలి సినమాలో మాహిష్మతి రాజు పాత్రలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు ప్రభాస్.తను చేసిన పాత్రకు ఎన్ని ప్రశంసలు వచ్చాయో మనందరికి తెలిసిందే.ఈ సమయంలో ప్రభాస్ తండ్రి ఉండి ఉంటే ఎంతో సంతోషించేవారు. ప్రభాస్ ని రాజు పాత్రలో చూడాలనుకున్న సూర్యనారాయణ ఆ కోరిక తీరకుండానే ఈ లోకం తిరిగి వెళ్లారు. ఇక కొద్ది రోజుల క్రితం ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు కూడా కాలం చేశారు. ఆ సమయంలో కూడా ప్రభాస్ చాలా ఎమోషనల్ అయ్యారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…