ఎన్‌టీఆర్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది.. ఆ మూవీ వ‌ల్లేనా..?

ఎన్టీఆర్‌.. ఈ మూడు అక్ష‌రాలు ఎంతో మంది ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాయి. ఆయ‌న భారతదేశంలో వారందరికే కాక ప్రపంచంలోని తెలుగు వారందరికీ తెలుసు. అంతటి విశిష్ఠమైన వ్యక్తి ఎన్టీరామారావు. ఈ రోజున మనమంతా మాట్లాడుకుంటున్న ‘హీరోయిజం’ అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన తొలి చిత్రం ‘పాతాళభైరవి’ అనే చెప్పాలి. దర్శకుడు కేవీరెడ్డి సృజనకు అనువుగా ‘పాతాళభైరవి’లో తోటరాముడు పాత్రకు జీవం పోసిన ఘనత నందమూరి తారకరామునిదే. అలా జానపద కథానాయకుడంటే ఎన్టీఆర్ అనేలా నిలచిపోయారు. పౌరాణికం. సాంఘికం, జాన‌ప‌దం ఇలా ఎన్నో చిత్రాల‌లో న‌టించి మెప్పించారు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు రాజ‌కీయాల‌లోను త‌న‌దైన ముద్ర వేసుకున్నారు. అయితే ఎన్టీఆర్ రాకీయాల్లోకి రావడానికి ఆయనను ఒక్క సినిమా చాల ప్రభావితం చేసిందనే విష‌యం మీకు తెలుసా. అదే స‌ర్ధార్ పాపారాయుడు సినిమా. 1980 లో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు అల్లూరి సీతారామరాజు వేషంలో కనిపించి మెప్పించారు. ఇందులో చాలా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర పోషించిన నేప‌థ్యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి ప్రజలను సేవ చేయాలనీ అనిపించింది. నా దేశం, బొబ్బిలి పులి సినిమాలు కూడా ఆయనలో ప్రజా సేవ చేయాలి అనే ఆలోచనా తెచ్చినప్పటికీ స‌ర్థార్ పాపారాయుడు చిత్రం ఆయనను పూర్తిగా రాజకీయనాయకునిగా మార్చింది అని అంటారు.

sr ntr came into politics because of that movie

స‌ర్ధార్ పాపారాయుడు రిలీజ్ అయిన రెండేళ్ల‌కే ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి సీఎం అయ్యారు. కేవలం ఓ ప్రాంతీయ పార్టీని స్థాపించిన ఆయన ఏకంగా పీఎం పీఠాన్ని కూడా కదిలించిన విషయం అందరికి తెలిసిందే. , తెలుగు వాడి ఆత్మగౌరవం ఢిల్లీనాయకుల పాదాల చెంత తాకట్టు పెట్టబడిందనుకొని నడుం బిగించిన ఎన్టీఆర్.. 1982 మార్చి 21న రామకృష్ణ సినిస్టూడియోస్‌లో మొట్ట మొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న అన్ని పత్రికల వాళ్లతో సమావేశం ఏర్పాటుచేసి రాజకీయాలలోకి ప్రవేశిస్తున్నానని ప్రకటించాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago