Chiranjeevi In Navy : నేవీ యూనిఫామ్ లో క‌నిపిస్తున్న చిరు.. ఇంత‌కీ అస‌లు ఈ ఫొటో క‌థేంటి..?

Chiranjeevi In Navy : తెలుగు సినీ పరిశ్ర‌మ‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక స్థానం ఏర్ప‌ర‌చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని ద‌శాబ్ధాలుగా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్నారు చిరు. ఇటీవ‌ల గాడ్ ఫాద‌ర్ సినిమాతో తెలుగు సినీ ప్రేమికుల‌ని అల‌రించిన చిరంజీవి ఇప్పుడు వాల్తేరు వీర‌య్య చిత్రంతో ప‌ల‌క‌రించ‌డానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే క‌రోనా స‌మ‌యం నుండి చిరంజీవి సోష‌ల్ మీడియా పోస్ట్‌ల‌తో కూడా సినీ ప్రేమికుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ వ‌స్తున్నాడు. ఆదివారం నేవీ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర ఫొటో పంచుకున్నారు చిరంజీవి. అది కాలేజ్ రోజుల నాటి ఫోటో కాగా, అందులో ఆయన నేవీ క్యాడెట్ యూనిఫాంలో ఉన్నారు.

గోవా ఎయిర్ పోర్టులో గతవారం తనను కొందరు నేవీ ఆఫీసర్లు కలిశారని వెల్లడించిన చిరంజీవి, తనకు పాతరోజులు గుర్తుకువచ్చాయని తెలిపారు. తాను కాలేజీలో చదువుకునే రోజుల్లో ఎన్ సీసీలో నావల్ క్యాడెట్ గా ఉన్నానని వివరించారు. కాగా, తనకు క్రమశిక్షణ అలవడిందంటే అందుకు కారణం ఎన్ సీసీ అని చిరంజీవి గతంలోనూ చెప్పారు. ఎన్ సీసీలో ఉన్నప్పుడు 1976 రిపబ్లిక్ డే సందర్భంగా ఏపీ తరఫున రాజభవన్ లో మార్చ్ పాస్ట్ లో పాల్గొన్నానని వెల్లడించారు. ఇటీవల వైఎన్ఎమ్ కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న చిరంజీవి ఈ సంగతులు పంచుకున్నారు.

Chiranjeevi In Navy what is the story behind it
Chiranjeevi In Navy

ఇక‌ ఈ మధ్యే గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో మెగాస్టార్‌ను ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించారు. ఆ కార్య‌క్ర‌మంలో మాట్లాడిన చిరంజీవి.. ‘కొన్ని గుర్తింపులు ప్రత్యేకమైనవి. ఈ అవార్డు కూడా అలాంటిదే. నేను మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. నాకు లభించిన కీర్తి, పేరు, చరిష్మా, అభిమానుల అమూల్యమైన ప్రేమ ఆప్యాయత, ప్రతిదానికీ నేను చిత్ర పరిశ్రమకు ఎప్ప‌టికీ రుణపడి ఉంటాను. మా తల్లిదండ్రులకు కొణిదెల శివశంకర వర ప్రసాద్‌గా పుట్టినా మళ్లీ చిరంజీవిగా సినీ పరిశ్రమలో పుట్టాను అని అన్నారు. అన్ని రంగాల‌లో క‌ర‌ప్ష‌న్ ఉంటుంది కాని,సినీ రంగంలో ఉండ‌దు అని జీవితాంతం నటనను కొనసాగిస్తానని చిరంజీవి ఎమోష‌న‌ల్‌గా చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago