Anasuya : ఇటీవలి కాలంలో అనసూయ.. తగ్గేదే లే అన్నట్టుగా వ్యవహరిస్తుంది. వరుస వివాదాలతో హాట్ టాపిక్ అవుతూ ఉంది. జబర్దస్త్ యాజమాన్యంతో పలు విభేదాలు రావడం వలన ఆమె జబర్ధస్త్ వెళ్లిపోయినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉండడం ఒక కారణం అయితే రియాల్టీ షోలకు కాస్త బ్రేక్ ఇవ్వాలని , అందుకే జబర్దస్త్ కు కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చిందని పేర్కొంది. దీన్ని బట్టి జబర్దస్ షో యాజమాన్యంతో ఆమెకు పెద్దగా విభేదాలు రాలేవని అభిమానులు అర్ధం చేసుకున్నారు. ఇక లైగర్ సినిమా రిలీజ్ తర్వాత ఆమె చేసిన కామెంట్స్‌కి నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు. అయితే ఎవరెంత దారుణంగా కామెంట్స్ చేస్తే వారికి అంత ధీటుగా బదులిస్తూ వచ్చింది అనసూయ.
బుల్లి తెర సుందరి అనసూయ ఓ వైపు యాంకర్‌గా రాణిస్తూనే మరో వైపు సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. జబర్ధస్త్‌కి దూరమైన తర్వాత వరుసగా సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు ఒకే చెబుతుంది.. బుల్లి తెరకు గుడ్ బై చెప్పేసి తన దృష్టి అంతా సినిమాలు, వెబ్ సిరీస్‌లపై పెట్టిన ఈ భామ… పుష్ప 2లో కీలక పాత్ర పోషించనుంది. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు తన క్యూట్ పిక్స్‌తో సందడి చేసే అనసూయ తాజాగా మద్యం గ్లాసుతో ఫొటోలు దిగి వాటిని షేర్ చేసింది. చేతిలో మద్యం గ్లాస్ పట్టుకుని చిరునవ్వులు చిందిస్తున్న ఈ భామ ని చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.
తన స్నేహితురాళ్లతో కలిసి ఓ రెస్టారెంట్ కు వెళ్లింది అనసూయ. అక్కడ మద్యం గ్లాసు పట్టుకొని పోజులు ఇచ్చింది. ఆ పిక్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ”నిన్న ట్వాస్ వైన్ ఓ క్లాక్ కు వెళ్లాను. ఇక నేను వైన్ తో ఉన్నప్పుడు బాగానే ఉంటాను లేకపోతే ఉండను. మీకు వైన్ కలపడంలో మంచి అనుభవం ఉంది ఇలాగే ఉండండి శ్రీముఖి మేకల” అంటూ ఫోటో కి కామెంట్‌గా రాసుకొచ్చింది. . ఈ ఫోటో చూసిన అభిమానులు స్పందిస్తూ.. మీరు వైన్ ఒక్కటే తాగుతారా? లేకుంటే ఇతర బ్రాండ్స్ కూడా టేస్ట్ చూస్తారా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక అనసూయ వర్క్ విషయానికి వస్తే.. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్న ”రంగమార్తాండ” మూవీలో ఓ కీలకపాత్ర చేస్తుంది. అలాగే త్వరలో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ”కన్యాశుల్కం” లో వేశ్య పాత్ర పోషించనున్నట్టు సమాచారం.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…