Chinna Jeeyar : యూనివర్సల్ హీరో ప్రభాస్ రాముడిగా కృతి సనన్ సీత గా నటిస్తున్న సినిమా ఆదిపురుష్…జూన్ 16న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాల్లో వేగం పుంజుకుంది.అందులో భాగంగానే ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మూవీపై భారీ అంచనాలు పెంచింది. ట్రైలర్ కూడా ఆసక్తిని రేకెత్తించింది. అయితే చిత్రంలోని కొన్ని పాత్రలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ లుక్ పై అనేక విమర్శలు వచ్చాయి. రాముడికి మీసాలు ఉండటమేమిటని ఎంతోమంది అన్నారు. టీజర్ లో కనిపించిన గ్రాఫిక్స్ సరిగా లేకపోవడం కూడా ఇలాంటి విమర్శలను మరింత పెంచింది. ఇటీవల రిలీజైన ట్రైలర్లు నెగెటివిటీని పోగొట్టేసి పాజిటివిటీని, అంచనాలను పెంచేసాయి.
ఇటీవల ప్రముఖ నటి కస్తూరి, ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ పై విమర్శలు చేసారు. రాముడికి మీసాలతో చూపించడం వల్ల కర్ణుడిలా ప్రభాస్ కనిపిస్తున్నారని ఆమె అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు రాముడి పాత్రలో కనిపించారనీ, ప్రభాస్ మాత్రం మీసాల కారణంగా కర్ణుడిలా కనిపిస్తున్నారని అన్నారు. ఇలా పలు విమర్శలు వస్తున్న నేపథ్యంలో సినిమాలో రాముడికి మీసాలు ఎందుకు అనే ప్రశ్నకు యూవీ క్రియేషన్స్ నిర్మాత విక్రమ్ స్పందిస్తూ ఆదిపురుష్ మూవీ అందరికీ నచ్చుతుందని సినిమా చూస్తే రామునికి మీసాలు ఎందుకు ఉన్నాయో అర్థం అవుతుందని ఆయన పేర్కొన్నారు.
అప్పట్లో అన్నమయ్య సినిమాలో నాగార్జున మీసాలతో కనిపించగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ కూడా మీసాలతో కనిపించనున్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగించారని విక్రమ్ వెల్లడించారు. ఇక ఇదిలా ఉంటే.. ఆదిపురుష్ చిత్ర అనుభూతిని అందరూ ఆస్వాదించాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రాంతంలో ఆదిపురుష్ రిలీజ్ లో భాగస్వామ్యం తీసుకున్న అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, అనాథ శరణాలయలు, వృద్ధాశ్రమాల్లో ఉండే వారికి ఉచితంగా పదివేల టికెట్లను ఇస్తామని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ప్రకటించింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…