Varun Tej : మరి కొద్ది రోజులలో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. గత ఆరేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి జూన్ 9న కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు.వరుణ్ తేజ్ పెదనాన్న చిరంజీవి, పెద్దమ్మ సురేఖల సమక్షంలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగాడు. ఇక వీరి ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేశాయి. జంట చూడముచ్చటగా ఉందని, నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో కలకాలం కలిసి ఉండాలని పలువురు ఆశీస్సులు అందించారు.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి లకు ఎంగేజ్మెంట్ శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి, మీ ఇద్దరిదీ ఒక అద్భుతమైన జోడీ అంటూ కొనియాడారు. మీరు ప్రేమానుబంధాలతో, సంతోషంగా జీవించాలని, మీ భవిష్యత్తు ఆనందంగా ఉండాలి అని ఆకాంక్షిస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ల ఎంగేజ్మెంట్ ఫోటోలను చిరంజీవి షేర్ చేశారు. ఇక ఎంగేజ్మెంట్ కి హాజరైన వారిలో అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు.
అయితే ఎంగేజ్‌మెంట్ పూర్తి చేసుకున్న ఈ జంట మరోవైపు తమ పర్సనల్ వర్క్స్‌తో బిజీ అయ్యారు. వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి తొలిసారి జిమ్ దగ్గర కనిపించారు. ఇద్దరు సపరేట్‌గా కనిపించగా, ఫొటోగ్రాఫర్స్ వారిని తమ కెమెరాలలో బంధించారు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మిస్టర్, అంతరిక్షం లాంటి చిత్రాలలో కలసి నటించారు. వీరిద్దరి ప్రేమకి బీజం పడింది మిస్టర్ చిత్రంతోనే అట. మిస్టర్ షూటింగ్ కోసం ఇటలీ వెళ్ళినప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డట్లు తెలుస్తోంది. కెరీర్ లో బాగా స్థిరపడే వరకు తమ ప్రేమ వ్యవహారాన్ని బయటకు రానీయలేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…