Chinmayi : సమంతకు డబ్బింగ్ చెప్పి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన ఆర్టిస్ట్ చిన్మయి. సమాజంలో జరుగుతున్న ఎన్నో విషయాలపై ఆమె రియాక్ట్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియా వేదికపై యాక్టీవ్ రోల్ పోషిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది చిన్మయి. ఈమెకి సినిమాల కన్నా కూడా వివాదాలతోనే ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విషయాలపై స్పందిస్తూ ఉంటే చిన్మయి వారికి సంబంధించిన విషయాలను సైతం ఎంతో ధైర్యంగా, బహిరంగంగానే చర్చిస్తూంటుంది. ఆడవాళ్లపై జరిగే అత్యాచారాలు, రేప్‌ల గురించి ఘాటుగా రియాక్ట్ కావడం చిన్మయి నైజం.
ఫెమినిజం పట్ల ఆమె పెట్టే పోస్టులు నిత్యం ఎంత వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తూనే ఉంటాం.. ఈ నేపథ్యంలోనే తాజాగా అమ్మాయిల వర్జినిటీ, పెళ్లి తర్వాత తొలి కలయికపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.మొదటి కలయిక సమయంలో అమ్మాయిలకు నొప్పి ఉంటుందని.. రక్తం వస్తేనే వర్జిన్ అని.. టైట్ గా ఉంటేనే వర్జిన్ అని అంటూ ఉంటారు.. అయితే అవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది. పెళ్లి కొడుకులు ఇలా ఊహిస్తారని.. కానీ రియాల్టీలో ఇలా ఉండదని.. ఇటీవల వచ్చిన ట్రోల్స్ పై మండిపడింది.. వెజీనా టైట్ గా ఉంటేనే.. రక్తం కారితేనే.. నొప్పి వస్తేనే.. వర్జిన్ అని అపోహ పడుతుంటారు. అవన్నీ అపోహలు అంటుంది చిన్మయి.
కలయిక సమయంలో నొప్పి ఉండి, రక్తం కారడం జరిగితే వైద్యులని తప్పక సంప్రదించాలని చిన్మయి చెప్పుకొచ్చింది. ఇలాంటి విషయాలను డిస్కస్ చేయడానికి సిగ్గు పడొద్దని, కానీ ఇప్పటి సమాజం అలానే వ్యవహరిస్తుంటుందని, ఇలాంటి విషయాలు ఇలా మాట్లాడతారా? అని మనల్నే తక్కువ చేసి చూస్తారంటూ చిన్మయి పేర్కొంది. తొలి కలయిక మీద అబ్బాయిలు వేసే ట్రోల్స్, జోకులు, మీమ్స్ నిజం కాదని, అవన్నీ అపోహలేనని, వాటిని నమ్మోద్దంటూ కోరింది. ఎలాంటి సమస్య ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించండని చిన్మయి సలహా ఇచ్చింది. తన పోస్టులతో ఎన్నో సార్లు ట్రోల్స్ బారిన పడింది చిన్మయి. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా తాను ఏదైతే చెప్పాలని అనుకుంటుందో అది నిర్మొహమాటంగా బయటపెడుతుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…