Chanra Babu : మ‌మ్మ‌ల్ని ఎవ‌డూ ఆప‌లేడు.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం.. అంటూ చంద్ర‌బాబు ఫైర్..

Chanra Babu : ఏపీలో రోజు రోజుకి రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంది. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ ఎవ‌రికి వారు స‌రికొత్త ఎత్తుగ‌డ‌లు వేస్తూ ఎన్నిక‌ల‌లో గెలిచే ప్ర‌య‌త్నం చేస్తున‌న్నారు. ఒక‌రిపై ఒక‌రు దారుణ‌మైన విమర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా చంద్ర‌బాబు త‌న‌కి అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోతాం. గెలిచి తీరాల్సిందే అంటూ చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను దసరా రోజున విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అది కూడా మహిళల సమక్షంలో ఉంటుందన్నారు. ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పేరతో పెళ్లి కానుక ఇచ్చింది తమ పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

మహిళల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలను ఆర్థికంగా స్థిరపరిచేందుకు తాము అన్ని వేళలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దసరా రోజు మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి మ‌రింత హీటెక్కింది. నారా లోకేష్ పాదయాత్రతో ఇప్పటికే పర్యటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో పేరుతో పర్యటించారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో రంగంలోకి దిగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఇప్పటికే అధికార పార్టీ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు.

Chanra Babu angry comments on ysrcp
Chanra Babu

అన్ని పార్టీల నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. కుప్పంలో ఈసారి ఎలాగైనా గెలవాలని అధికార వైఎస్సార్సీపీ పట్టుదలతో ఉంది. చిత్తూరు జిల్లాలో మిగిలిన స్థానాల సంగతి ఎలా ఉన్నా.. కుప్పంపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. గతంతో పోలిస్తే చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కుప్పంలో తన పట్టును కోల్పోతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీనే గెలుచుకుంది. దీంతో కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు వాలయని అంటున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago