Gautam Krishna : సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలు సినిమాల్లోకి రాకుండానే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సితారకి ఇప్పటికే మంచి క్రేజ్ దక్కగా, గౌతమ్ కూడా అందరితో ప్రశంసలు దక్కించుకుంటున్నాడు. ఇటీవల గౌతమ్ తన పుట్టిన రోజు(17)ని జరుపుకున్నారు. మహేష్‌బాబు, నమ్రత తనయుడికి గొప్పగా బర్త్ డే విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియా ద్వారా వారుపెట్టిన పోస్టులు వైరల్ అయ్యాయి. అయితే గౌతమ్ తన బర్త్ డేని చాలా స్పెషల్‌గా మార్చుకున్నారు సొంతూరు బుర్రిపాలెంలో సెలబ్రేట్ చేసుకున్నారు. గౌతమ్ తన పుట్టిన రోజు బుర్రిపాలెంలోని పిల్లలందరికీ స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాడు. అనంతర ఆశ్రమ్ ఆకృతి ఆర్గనైజేషన్‌లో పిల్లలతో కలిసి బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకున్నాడు.
ఆ ఆశ్రమంలోని పిల్లలతో కాసేపు ముచ్చటించాడు. వారి మధ్యలోనే కేక్ కట్ చేసి పుట్టిన రోజును సెలెబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను గౌతమ్ షేర్ చేశాడు. అనంతరం మాట్లాడుతూ.. థాంక్యూ ఎంబీ ఫౌండేషన్.. ఇలా నేను అందరికీ సాయం చేయడంలో నాకు అండగా నిలబడ్డారు.. ఈ పిల్లలందరినీ తీసుకొచ్చినందుకు, నన్ను వారి వద్దకు తీసుకెళ్లినందుకు ఇలా సాయం చేయగలిగేలా చేసినందుకు థాంక్స్. ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది.. ఇలా ఈ పిల్లలతో బర్త్ డే సెలెబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది.. ఇదే నాకు బెస్ట్ బర్త్ డే.. అంటూ గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు.
సితార సైతం తన బర్త్ డేను ఇలానే సెలెబ్రేట్ చేసుకుంది. బుర్రిపాలంలోని స్కూల్ అమ్మాయిలకు సైకిళ్లను కొనిచ్చింది.. అనంతరం ఓ ఆశ్రమంలోని పిల్లల మధ్య తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకుంది. వారితో కాసేపు ముచ్చటిస్తూ సమయాన్ని గడిపింది. ఇప్పుడు గౌతమ్ ఇలా తన బర్త్ డేను సెలెబ్రేట్ చేసుకున్నాడు. గౌతమ్ చేసిన మంచి పనులకు అతడిపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే గౌతమ్ త్వరలో సినిమాల్లోకి రాబోతున్నాడని అంటున్నారు. దీనిపై పూర్తి స్పష్టత లేదు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…