Chanra Babu : ఏపీలో రోజు రోజుకి రాజకీయం మరింత వేడెక్కుతుంది. టీడీపీ, జనసేన, వైసీపీ ఎవరికి వారు సరికొత్త ఎత్తుగడలు వేస్తూ ఎన్నికలలో గెలిచే ప్రయత్నం చేస్తునన్నారు. ఒకరిపై ఒకరు దారుణమైన విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా చంద్రబాబు తనకి అడ్డొచ్చిన వారిని తొక్కుకుంటూ పోతాం. గెలిచి తీరాల్సిందే అంటూ చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను దసరా రోజున విడుదల చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకటించారు. అది కూడా మహిళల సమక్షంలో ఉంటుందన్నారు. ఆడబిడ్డలకు అండగా ఉంటామన్న చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆడబిడ్డ పేరతో పెళ్లి కానుక ఇచ్చింది తమ పార్టీ అని చంద్రబాబు గుర్తు చేశారు. ఆనాడు ఆడబిడ్డలు కష్టపడకూడదనే దీపం పథకం కింద సిలిండర్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
మహిళల భవిష్యత్‌కు మహాశక్తి పథకం తోడ్పుతుందని ధీమా వ్యక్తం చేశారు. మహిళలను ఆర్థికంగా స్థిరపరిచేందుకు తాము అన్ని వేళలా కృషి చేస్తుందని స్పష్టం చేశారు. దసరా రోజు మహిళల సమక్షంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. ఏపీలో ఎన్నికల హడావుడి మరింత హీటెక్కింది. నారా లోకేష్ పాదయాత్రతో ఇప్పటికే పర్యటిస్తుండగా.. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో పేరుతో పర్యటించారు. ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ పేరుతో రంగంలోకి దిగుతున్నారు. గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో ఇప్పటికే అధికార పార్టీ నేతలు ప్రజల్లో తిరుగుతున్నారు.
అన్ని పార్టీల నాయకులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. చంద్రబాబు నాయుడు 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. కుప్పంలో ఈసారి ఎలాగైనా గెలవాలని అధికార వైఎస్సార్సీపీ పట్టుదలతో ఉంది. చిత్తూరు జిల్లాలో మిగిలిన స్థానాల సంగతి ఎలా ఉన్నా.. కుప్పంపైనే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. గతంతో పోలిస్తే చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కుప్పంలో తన పట్టును కోల్పోతున్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీనే గెలుచుకుంది. దీంతో కుప్పంలో టీడీపీ కంచుకోటకు బీటలు వాలయని అంటున్నారు.